News November 17, 2024

మణిపుర్ సర్కారుకు మైతేయ్ గ్రూప్స్ అల్టిమేటం

image

సాయుధ మిలిటెంట్లపై చర్యలు తీసుకునేందుకు మణిపుర్‌ ప్రభుత్వానికి అక్కడి మైతేయ్ పౌర హక్కుల సంఘాలు 24 గంటలు టైమ్ ఇస్తూ అల్టిమేటం జారీ చేశాయి. శనివారం ఓ మూక రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ నివాసంలోకి వెళ్లేందుకు యత్నించిన సంగతి తెలిసిందే. ‘సాయుధ మూకలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ప్రజల ఆగ్రహం ఎలా ఉంటుందో చూపిస్తాం’ అని మైతేయ్ సంఘాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం 5 జిల్లాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది.

Similar News

News November 23, 2025

AI ఎఫెక్ట్.. అకౌంట్ లాక్ చేసుకున్న ‘బందనా గర్ల్’

image

సెల్ఫీ వీడియోతో పాపులారిటీ సంపాదించుకున్న <<18363367>>‘బందనా (తలకు కట్టుకునే వస్త్రం) గర్ల్’<<>> ఎక్స్ అకౌంట్‌ లాక్ చేసుకున్నారు. ఒక్కసారిగా వచ్చిన ఫేమ్ తన వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపిస్తోందని పేర్కొన్నారు. తన పర్మిషన్ లేకుండా కొందరు AI ఫొటోలను క్రియేట్ చేసి దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు. ‘ఈ రోజు మేకప్ బాగా కుదిరింది’ అంటూ ఆమె ఆటోలో తీసుకున్న 2 సెకన్ల వీడియో 100 మిలియన్ల వ్యూస్ సాధించిన సంగతి తెలిసిందే.

News November 23, 2025

సంజూ మరో‘సారీ’

image

భారత ప్లేయర్ సంజూ శాంసన్‌కు వన్డేల్లో మరోసారి నిరాశే ఎదురైంది. దక్షిణాఫ్రికాతో వన్డేలకు ప్రకటించిన 15 మందితో కూడిన జట్టులో ఈ స్టార్ ప్లేయర్‌కు చోటు దక్కలేదు. జడేజా చాలా రోజుల తర్వాత వన్డేలకు ఎంపికయ్యారు. ఎన్నో రోజులుగా చోటు కోసం ఎదురుచూస్తున్న రుతురాజ్ సైతం టీమ్‌లోకి వచ్చారు. అయితే వన్డేల్లో మెరుగైన గణాంకాలు ఉన్నా రెండేళ్లుగా సంజూను ఎంపిక చేయకపోవడం దారుణమని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. మీ కామెంట్?

News November 23, 2025

ఆహా.. ఓహో! అంతా అరచేతిలో స్వర్గమేనా?

image

AP: ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్స్ అంటే పోటీ ప్రకటనలు, ప్రదర్శనల వేదికలుగా మారుతున్నాయా? జగన్ CMగా ఉండగా 340 కంపెనీలు ₹13 లక్షల కోట్ల పెట్టుబడికి ఆసక్తి చూపాయని నాటి ప్రభుత్వం చెప్పింది. ఇక 16 లక్షల ఉద్యోగాలు వచ్చేలా 625 కంపెనీలు ₹13.25 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌కు ఇంట్రస్ట్ చూపాయని CBN తాజా ప్రభుత్వ స్టేట్మెంట్. వాస్తవ పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనలు ప్రకటనలకు దగ్గరగా ఉన్నాయా? అంటే ఆన్సర్ మీకు తెలుసుగా!