News December 27, 2024

MEMORIES: కరెన్సీ నోటుపై మన్మోహన్ సంతకం

image

ప్రపంచంలోని గొప్ప ఆర్థికవేత్తల్లో మన్మోహన్ సింగ్ ఒకరు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో పట్టా పొందిన ఆయన.. 1982లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆ సమయంలో ప్రణబ్ ముఖర్జీ ఆర్థికమంత్రిగా, ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నారు. 1985 వరకు ఆయన ఆర్బీఐ గవర్నర్‌గా పని చేశారు. ఆ సమయంలో ఆయన కరెన్సీపై సంతకాలు చేసిన ఫొటోలను నెటిజన్లు షేర్ చేస్తున్నారు.

Similar News

News December 7, 2025

సంకటహర చతుర్థి ప్రత్యేకత ఏంటంటే?

image

ఇవాళ వినాయకుడిని పూజిస్తే జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయని విశ్వసిస్తారు. ‘ఇవాళ సాయంత్రం 6.25 గంటలకు చతుర్థి ప్రారంభమయ్యి సోమవారం సాయంత్రం 4.03 గంటలకు ముగుస్తుంది. ఈరోజు వినాయకుడిని గరికతో పూజించడం విశేషం. చంద్ర దర్శనం తర్వాత వినాయక పూజ చేసుకోవడం శుభప్రదం. సంకటహర చతుర్థి వ్రతాన్ని చతుర్థి తిథిరోజు 3, 5, 11, 21 నెలలపాటు ఆచరించాలి. దీనిని బహుళ చవితి రోజు ప్రారంభించాలి’ అని పండితులు చెబుతున్నారు.

News December 7, 2025

ఈ ఆలయాలకు వెళ్తే..

image

మహారాష్ట్రలోని శని సింగ్నాపూర్ శని దోష నివారణకు చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఊర్లో ఇళ్లు, షాపులకు తలుపులు ఉండవు. న్యాయాధిపతి శని దేవుడి మహిమ వల్ల ఇక్కడ దొంగతనాలు జరగవని నమ్ముతారు. శని దోషం ఉన్నవారు ఈ ఆలయాన్ని దర్శిస్తే శని దోషం తొలగిపోతుందని పండితులు చెబుతారు. శని ధామ్(ఢిల్లీ), కోకిలవ ధామ్(UP), తిరునల్లార్(తమిళనాడు) ఆలయాలను దర్శించడం వల్ల కూడా శని గ్రహ ప్రభావం తగ్గుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

News December 7, 2025

కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశావ్: స్టెయిన్

image

టీమ్ ఇండియాపై వన్డే సిరీస్ కోల్పోవడం కాస్త నిరుత్సాహ పరిచిందని SA మాజీ పేసర్ డేల్ స్టెయిన్ పేర్కొన్నారు. ‘ఇది ఒక బ్యాడ్ డే. సిరీస్ డిసైడర్‌లో తప్పులకు తావుండకూడదు. టీమ్ ఇండియాకి శుభాకాంక్షలు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ(65*) అద్భుతంగా బ్యాటింగ్ చేశావ్. నేను 20-20 మ్యాచుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. IND-SA మధ్య 5 టీ20ల సిరీస్ డిసెంబర్ 9 నుంచి కటక్ వేదికగా ప్రారంభంకానుంది.