News April 18, 2025
MEMU రైలు అనంతపురం వరకు..

అనంతపురం జిల్లా ప్రజలకు రైల్యే శాఖ తీపి కబురు చెప్పింది. పుట్టపర్తి ప్రశాంతి నిలయం నుంచి బెంగళూరుకు నడుస్తున్న MEMU రైలును అనంతపురం వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఈ రైలు అనంతపురం-బెంగళూరు మధ్య పరుగులు పెట్టనుంది. KSR బెంగళూరులో ఉ.8.35 గంటలకు బయలు దేరి అనంతపురానికి మ.1.55 గంటలకు చేరుకుంటుంది. తిరిగి అనంతలో మ.2.10 గంటలకు బయలుదేరి రాత్రి 7.50 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది.
Similar News
News April 20, 2025
బాలుడిని కిడ్నాప్ చేసి లైంగిక దాడి.. మహిళకు జైలు శిక్ష

రాజస్థాన్‌లో ఓ బాలుడిని(17) అపహరించి లైంగిక దాడికి పాల్పడిన మహిళ(30)కు బుండీ పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2023 నవంబరు 7న ఘటన జరగగా, బాధితుడి తల్లి అప్పట్లో పోలీసుల్ని ఆశ్రయించారు. నిందితురాలు తమ కుమారుడికి మద్యం పట్టించి లైంగిక దాడికి పాల్పడిందని వారికి తెలిపారు. దర్యాప్తులో ఫిర్యాదు నిజమని నిర్ధారణ కావడంతో పోక్సో కోర్టు నిందితురాలికి జైలు శిక్షతో పాటు రూ.45వేల జరిమానా విధించింది.
News April 20, 2025
వైవీయూ స్నాతకోత్సవం నోటిఫికేషన్ విడుదల

వైవీయూ11,12,13,14వ కాన్వకేషన్స్ జూన్/ జులై నెలల్లో నిర్వహించనున్నామని వైవీయూ పరీక్షల నిర్వహణ అధికారి ప్రొ. కేఎస్వీ కృష్ణారావు వెల్లడించారు. వీసీ ప్రొ. అల్లం శ్రీనివాస రావు స్నాతకోత్సవాలను నిర్వహించేందుకు తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా వైవీయూ స్నాతకోత్సవం నోటిఫికేషన్‌ను http://convocation.yvuexams.in వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు.
News April 20, 2025
మ్యాక్స్‌వెల్, లివింగ్‌స్టోన్‌పై సెహ్వాగ్ తీవ్ర విమర్శలు

స్టార్ ఆటగాళ్లు మ్యాక్స్‌వెల్, లివింగ్‌స్టోన్‌పై మాజీ క్రికెటర్ సెహ్వాగ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘వారిలో ఆడాలన్న ఆకలి, తమ జట్లకు ట్రోఫీలను గెలిపించాలన్న కసి ఏమాత్రం కనిపించడం లేదు. ఇద్దరూ భారత్‌లో హాలిడే చేసుకోవడానికి వచ్చారంతే. నేను చాలామంది ఓవర్సీస్ ఆటగాళ్లతో ఆడాను. వాళ్లలో అధికశాతం ఆటగాళ్లు ఇలాగే ఉంటారు’ అని పేర్కొన్నారు. ఈ ఏడాది IPLలో మ్యాక్సీ PBKSకి, లివింగ్‌స్టోన్ RCBకి ఆడుతున్నారు.