News October 19, 2024

డేట్‌లో నేనే డబ్బు కట్టాలని మగాళ్లు భావిస్తారు: శ్రుతిహాసన్

image

డేట్‌కి వెళ్లినప్పుడు బిల్లుల్ని తనతోనే కట్టించాలని అబ్బాయిలు ట్రై చేస్తుంటారని నటి శ్రుతి హాసన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘డేట్‌కి వెళ్లినప్పుడు నేనే డబ్బులు పే చేస్తా. ప్రేమను వ్యక్తీకరించడంలో అది నా శైలి. కానీ 3 నెలల తర్వాత కూడా నేను బిల్లు కట్టాలంటే ఎలా? డబ్బుంది కాబట్టి కట్టడం నీకు ఇష్టమనుకున్నా అంటుంటారు కొంతమంది. అందుకే డేట్‌లో బిల్లు సగం మాత్రమే ఇవ్వడం నేర్చుకున్నా’ అని పేర్కొన్నారు.

Similar News

News October 19, 2024

ITI ప్రవేశాలకు గడువు పొడిగింపు

image

TG: ఐటీఐ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి దరఖాస్తు గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. వివిధ ట్రేడ్లలో చేరేందుకు 8, 10వ తరగతి పాసై, 1-8-2024 నాటికి 14 ఏళ్లు నిండిన విద్యార్థులు అర్హులని చెప్పారు. గత కౌన్సెలింగ్‌లలో సీట్లు పొందని అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. పూర్తి వివరాల కోసం <>https://iti.telangana.gov.in<<>>/ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

News October 19, 2024

రాష్ట్రానికి మరో వాయు‘గండం’

image

AP: బంగాళాఖాతంలో ఈనెల 22 నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఇది 24 నాటికి వాయుగుండంగా బలపడుతుందని అంచనా వేసింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. కాగా ఇవాళ, రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.

News October 19, 2024

హమాస్ చీఫ్ సిన్వర్ స్థానం దక్కేదెవరికో?

image

హమాస్ గ్రూప్ అధినేత యాహ్యా సిన్వర్‌ను ఐడీఎఫ్ దళాలు మట్టుబెట్టాయి. దీంతో హమాస్‌ను ఎవరు ముందుకు నడిపిస్తారనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. హమాస్ వ్యవస్థాపకుల్లో ఒకరు మహ్మద్ అల్ జహర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆ తర్వాతి వరుసలో సిన్వర్ సోదరుడు మహ్మద్ సిన్వర్, హమాస్ మిలటరీ వింగ్ కమాండర్ మహ్మద్ దీఫ్, హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యులు మౌసా అబు మార్జౌక్, ఖలీల్ అల్ హయ్యా, ఖలేద్ మెషాల్ ఉన్నారు.