News July 27, 2024
పురుషుల 10M ఎయిర్ ఫిస్టల్ పోటీల్లోనూ ఓటమే

ఒలింపిక్స్ షూటింగులో ఓటముల పరంపర కొనసాగుతోంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ పోటీల్లో భారత ఆటగాళ్లు క్వాలిఫయర్స్‌తోనే ఆగిపోయారు. సరబ్‌జీత్ సింగ్ (577 పాయింట్లు) 9వ స్థానంలో నిలిచారు. అర్జున్ (574) 18వ స్థానానికి పరిమితం అయ్యారు. ఫైనల్ చేరాలంటే తొలి 8 స్థానాల్లో నిలవాలి. అంతకు ముందు మిక్స్‌డ్ పోటీల్లోనూ భారత జట్లకు ఓటమి తప్పలేదు. మహిళల పోటీల్లో మనూ భాకర్ ఏమైనా చేస్తుందేమో చూడాలి. #<<-se>>#Olympics2024<<>>
Similar News
News April 2, 2026
పిల్లలను బేబీ వాకర్‌తో నడిపిస్తున్నారా?

పిల్లలు త్వరగా నడవాలని చాలామంది పేరెంట్స్ బేబీ వాకర్‌లో ఎక్కువసేపు కూర్చోబెడతారు. కానీ దీనివల్ల లాభాల కంటే.. నష్టాలే ఎక్కువంటున్నారు నిపుణులు. ఎక్కువగా బేబీవాకర్‌లో ఉండటం వల్ల చిన్నారుల వెన్నెముక వంకరగా మారుతుందని చెబుతున్నారు. అలాగే దీనివల్ల కాళ్లు దూరంగా పెట్టి నడవడం అలవాటవుతుంది. బిడ్డ తనంతట తానుగా లేచి నడిస్తే మంచి సమతుల్యత ఉంటుంది. కాబట్టి వాకర్స్ వాడటం మంచిది కాదని సూచిస్తున్నారు.
News April 2, 2026
IPLలో నా ఫేవరెట్ కెప్టెన్ అతడే: పాటీదార్

IPLలో తన ఫేవరెట్ ప్లేయర్లు ఎవరో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ వెల్లడించారు. రోహిత్ శర్మ తన అభిమాన కెప్టెన్ అని తెలిపారు.
*బ్యాటర్: విరాట్ కోహ్లీ *కెప్టెన్: రోహిత్ శర్మ *ఫీల్డర్: డుప్లెసిస్ *ఫాస్ట్ బౌలర్: డేల్ స్టెయిన్ *స్పిన్నర్: సునీల్ నరైన్ *ఫినిషర్: ఏబీ డివిలియర్స్ *డెత్ ఓవర్ బౌలర్: బుమ్రా *కవర్ డ్రైవ్: విరాట్ కోహ్లీ.
News April 2, 2026
ఆవిరి పట్టడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

వారానికోసారి ముఖానికి ఆవిరి పట్టిస్తే మెరిసే మోము సొంతమవుతుందంటున్నారు నిపుణులు. ఆవిరి పట్టడం వల్ల బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, మృతకణాలు సులువుగా వచ్చేస్తాయి. దీంతో మొటిమల బాధ తగ్గుతుంది. ఆవిరి పట్టడం వల్ల రక్తప్రసరణ పెరిగి కొలాజెన్, ఎలాస్టిన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో చర్మం యవ్వనంగా మారుతుంది. కానీ ఎక్కువసేపు ఆవిరి పట్టడం వల్ల సహజ నూనెలు తగ్గి ముడతలు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.


