News July 30, 2024
మా జిల్లాను మహారాష్ట్రలో కలపండి: బీజేపీ ఎమ్మెల్యే

TG: ప్రత్యేక రాష్ట్రంలోనూ ఉమ్మడి ఆదిలాబాద్‌కు అన్యాయం జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే హరీశ్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక అదే కొనసాగుతోందని అసెంబ్లీలో దుయ్యబట్టారు. దక్షిణ తెలంగాణలో ప్రాజెక్టుల మీద ఉన్న శ్రద్ధ ఉత్తర తెలంగాణ మీద కూడా చూపాలని ప్రభుత్వాన్ని కోరారు. కొమురం భీం ఆసిఫాబాద్‌కు నిధులు కేటాయించకపోతే మహారాష్ట్రలో కలపాలని డిమాండ్ చేశారు.
Similar News
News November 21, 2025
సిద్దిపేట: ‘మారేడుమిల్లి ఘటనపై విచారణ చేయాలి’

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ ఘటనపై పౌర హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాగుల భూపతి శుక్రవారం మాట్లాడుతూ.. ఈ ఘటనలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా అధికారులు గుర్తించిన మడవి హిడ్మా, అతని సహచరి రాజక్క (రాజే) సహా పలువురి మరణంపై నిజానిజాలు వెలుగులోకి తేవాలని డిమాండ్ చేశారు.
News November 21, 2025
కృష్ణా జలాలపై జగన్ హెచ్చరిక

AP: కృష్ణా జలాల విషయంలో మరోసారి సంక్లిష్ట పరిస్థితి ఏర్పడిందని YCP అధినేత YS జగన్ ట్వీట్ చేశారు. CM చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపైనే రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఉందని ఆయన స్పష్టం చేశారు. రాబోయే KWDT-II విచారణలో తెలంగాణ 763 TMCలను డిమాండ్ చేస్తోందని, బచావత్ ట్రైబ్యునల్ APకి కేటాయించిన 512 TMCల్లో ఒక్క చుక్కనూ కోల్పోకుండా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని హెచ్చరించారు.
News November 21, 2025
NPCILలో 122 పోస్టులు.. అప్లై చేశారా?

ముంబైలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NPCIL) 122 పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, MBA, ఇంజినీరింగ్ డిగ్రీ, LLB ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు ఈనెల 27 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్సైట్: https://npcilcareers.co.in


