News August 18, 2024

బీఆర్ఎస్‌ను విలీనం చేసుకున్నా ఉపయోగం లేదు: బండి

image

TG: బీజేపీలో బీఆర్ఎస్‌ను విలీనం చేస్తారనే ప్రచారాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి ఖండించారు. అవినీతి, కుటుంబ పార్టీలకు తాము దూరమని చెప్పారు. బీఆర్ఎస్‌ను విలీనం చేసుకున్నా ఉపయోగమేమీ లేదన్నారు. KCR ప్రస్థానం కాంగ్రెస్‌తోనే మొదలైందని గుర్తు చేశారు. BRS త్వరలోనే కాంగ్రెస్‌లో విలీనం కాబోతోందని తెలిపారు. 6 గ్యారంటీలను పక్కదోవ పట్టించడానికే కాంగ్రెస్ విలీన ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.

Similar News

News December 5, 2025

HYD: ‘మెట్రో’ భూములు ఏమయ్యాయి?

image

మెట్రో రైలు నిర్మాణంలో భాగంగా అప్పటి ప్రభుత్వం మెట్రోకు 57 ఎకరాలను కేటాయించింది. మెట్రో అధికారులు మాత్రం కేవలం 18 ఎకరాలను మాత్రమే వినియోగించారు. మూసారంబాగ్, పంజాగుట్ట, ఎర్రమంజిల్, మాదాపూర్‌లో మాత్రమే మాల్స్ కట్టి మిగతా 39 ఎకరాలను వదిలేసింది. ఇపుడు ఈ స్థలాలను ఆడిటింగ్ అధికారులు పరిశీలిస్తున్నారు. అసలు ఆ భూములు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి? ఎందుకు వాటిని వాడుకోలేదని తెలుసుకునే పనిలో పడ్డారు.

News December 5, 2025

విమానాల రద్దు.. ఈ విషయాలు తెలుసుకోండి!

image

3 రోజులుగా ఇండిగో విమాన <<18473431>>సర్వీసులు<<>> రద్దవుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయాల్లో ఎయిర్‌లైన్స్ పాటించాల్సిన బాధ్యతలపై DGCA రూల్స్ జారీ చేసింది. ఆ ప్రకారం.. సర్వీసు రద్దయితే ముందే సమాచారం ఇవ్వాలి. ప్రత్యామ్నాయ విమానంలో ఫ్రీగా వెళ్లే ఏర్పాటు చేయాలి. ప్రయాణికులు కోరుకుంటే రీఫండ్ చేయాలి. 2గంటలకు మించి ఆలస్యమైతే భోజనం, ఫ్రెష్ అయ్యే సౌకర్యం కల్పించాలి. 24 గంటలు దాటితే ఫ్రీగా హోటల్, రవాణా ఏర్పాటు చేయాలి.

News December 5, 2025

పుతిన్‌కు ‘బాడీ డబుల్స్’ ఉన్నారా?

image

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన నేపథ్యంలో ఆయన ‘బాడీ డబుల్స్’ గురించి చర్చ జరుగుతోంది. బహిరంగ కార్యక్రమాలు, ప్రయాణాలకు బాడీ డబుల్స్‌ను ఉపయోగిస్తారని ఊహాగానాలు ఉన్నాయి. పుతిన్‌కు ముగ్గురు డూప్స్ ఉన్నారని ఉక్రెయిన్ గతంలో చెప్పింది. వారు ‘క్లోన్ ఆర్మీ’ అని మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే అవన్నీ అవాస్తవాలని, ‘బాడీ డబుల్’ ప్రతిపాదనలను తాను తిరస్కరించానని గతంలో పుతిన్ పలుమార్లు క్లారిటీ ఇచ్చారు.