News August 16, 2024
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయం: సీఎం రేవంత్

TG: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కావడం ఖాయమన్నారు. ‘బీఆర్ఎస్కు నలుగురు రాజ్యసభ సభ్యులున్నారు. పార్టీ విలీనంతో తొలుత కవితకు బెయిల్ వస్తుంది. కేసీఆర్కు గవర్నర్ పదవి, కేటీఆర్కు కేంద్ర మంత్రి పదవి, హరీశ్రావుకు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవి ఇస్తారు’ అని చెప్పారు.
Similar News
News January 16, 2026
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావుకు బెయిల్ వస్తుందా?

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు, SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సిట్ ఇప్పటికే ఆయన్ను 14 రోజులపాటు కస్టడీకి తీసుకొని విచారించింది. ఇందుకు సంబంధించి నివేదికను ఈరోజు కోర్టులో సమర్పించనుంది. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు అనుమతి కోరే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావుకు బెయిల్ వస్తుందా? లేదా అరెస్టుకు కోర్టు అనుమతిస్తుందా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
News January 16, 2026
225 పోస్టులకు నోటిఫికేషన్

<
News January 16, 2026
తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.220 తగ్గి రూ.1,43,400 వద్ద ట్రేడవుతుండగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.200 తగ్గి రూ.1,31,450కు చేరుకుంది. వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండి ఏకంగా రూ.4,000 తగ్గి రూ.3,06,000 వద్ద కొనసాగుతోంది. కొనుగోలుదారులకు ఇది ఊరట కలిగించే విషయమే అయినా ప్రాంతాలను బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు.


