News May 25, 2024

స్టార్‌ ఇండియాతో విలీనం.. సీసీఐ అనుమతి కోరిన రిలయన్స్

image

వయాకామ్ 18, స్టార్ ఇండియా వినోద ఛానళ్ల విలీనం గత కొంతకాలంగా ప్రతిపాదనల దశలో ఉంది. ఈ విలీనానికి సంబంధించి ఇండస్ట్రీస్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) అనుమతిని వయాకామ్ 18 మాతృసంస్థ రిలయన్స్ తాజాగా కోరింది. ఈ విలీనం వలన దేశంలో పోటీ వ్యాపారాలపై ఎటువంటి ప్రభావం ఉండదని వివరించింది. ఈ డీల్ పూర్తయితే స్టార్, వయాకామ్‌కు చెందిన 100కు పైగా ఛానళ్లు, 2 ఓటీటీ సంస్థలు ఒకే గొడుగు కిందకు రానున్నాయి.

Similar News

News November 27, 2025

డెలివరీ తర్వాత ఈ లక్షణాలున్నాయా?

image

డెలివరీ తర్వాత మహిళల్లో అనేక మార్పులు వస్తాయి. జుట్టు ఎక్కువగా రాలడం, శారీరక మార్పులు, వాపు, మలబద్ధకం, కాళ్లు, పాదాల్లో వాపు వంటి సమస్యలు వస్తాయి. వీటిని తగ్గించాలంటే పోషకాలతో కూడిన సమతులాహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా ఇవి కొన్ని రోజుల్లో తగ్గిపోతాయి. కానీ ఎన్ని రోజులైనా వీటి నుంచి ఉపశమనం లభించకపోతే, అశ్రద్ధ చేయకుండా సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించడం మంచిదని చెబుతున్నారు.

News November 27, 2025

బాధ్యతలకు విరుద్ధంగా గవర్నర్ కామెంట్స్: CM స్టాలిన్

image

తమిళనాడులో లా అండ్ ఆర్డర్ సమస్యలు ఉన్నాయని, రాష్ట్రం ఉగ్రవాద ధోరణితో ఉందని గవర్నర్ ఆర్‌ఎన్ రవి కామెంట్స్‌ను సీఎం స్టాలిన్ తప్పుబట్టారు. ఉగ్ర దాడుల నుంచి ప్రజల ప్రాణాలు కాపాడలేని కేంద్రాన్ని అదే పనిగా ఆయన ప్రశంసిస్తున్నారని CM మండిపడ్డారు. శాంతికి నిలయమైన తమిళనాడును ఉగ్రవాద రాష్ట్రమంటున్న గవర్నర్‌ అహంకారాన్ని అణిచివేస్తామన్నారు. బాధ్యతలకు విరుద్ధంగా గవర్నర్ కామెంట్స్ ఉన్నాయని CM మండిపడ్డారు.

News November 27, 2025

మీ ఇంట్లో ‘దక్షిణామూర్తి’ చిత్రపటం ఉందా?

image

శివుడి జ్ఞాన స్వరూపమే దక్షిణామూర్తి. ఇంట్లో ఆయన చిత్రపటం ఉంటే అది సకల శుభాలు, అష్టైశ్వర్యాలకు మార్గమని పండితులు, వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అపమృత్యు దోషాలు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు ఆయనను ఆరాధిస్తారు. దక్షిణామూర్తి దర్శనంతో పిల్లల్లో విద్యా బుద్ధులు వికసించి, జ్ఞానం, ఏకాగ్రత సిద్ధిస్తాయని నమ్మకం.
☞ దక్షిణామూర్తి విగ్రహాన్ని ఇంట్లో ఏ రోజున ప్రతిష్ఠించాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.