News December 24, 2024
క్రిస్మస్ శుభాకాంక్షలు: వైఎస్ జగన్
క్రైస్తవులకు AP మాజీ CM YS జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ‘కరుణ, ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలు. తద్వారా మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా మార్గనిర్దేశం చేశారు. దుర్మార్గం నుంచి సన్మార్గానికి, అమానుషత్వం నుంచి మానవత్వానికి, చెడు నుంచి మంచికి, దురాశ నుంచి దాతృత్వం, త్యాగాలకు జీసస్ బాటలు వేశారు’ అని తెలిపారు.
Similar News
News December 25, 2024
ఏపీకి రూ.446 కోట్లు విడుదల
AP: రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం గ్రాంటు రూ.446 కోట్లను కేంద్రం విడుదల చేసింది. 2024-25కుగానూ రెండో వాయిదా కింద రూ.421 కోట్లు, ఒకటో వాయిదా కింద పెండింగ్లో ఉన్న రూ.25 కోట్లను అందించింది. 13,097 గ్రామ పంచాయతీలు, 650 బ్లాక్ పంచాయతీలకు ఈ నిధులకు కేటాయించనున్నారు.
News December 25, 2024
ఛాంపియన్స్ ట్రోఫీ: హిస్టరీ, విజేతలు
వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. 1998లో ప్రారంభమైన ఈ ట్రోఫీలో 2009 నుంచి ICC ర్యాంకింగ్స్లోని టాప్-8 జట్లు పాల్గొంటున్నాయి. టెస్టులు ఆడని దేశాల్లో క్రికెట్ అభివృద్ధికి నిధుల సమీకరణే లక్ష్యంగా ఇది మొదలైంది. ఆరంభ ఎడిషన్లో SA విజేతగా నిలిచింది. 2000లో NZ, 2002లో శ్రీలంక-భారత్, 2004లో WI, 2006, 09లో AUS, 2013లో IND, 2017లో పాక్ టైటిల్ను సాధించాయి.
News December 25, 2024
అక్రిడేషన్ గడువు మరో 3 నెలలు పొడిగింపు
TG: రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువును మరో 3 నెలల పాటు పొడిగిస్తూ సమాచార పౌర సంబంధాల శాఖ ఉత్తర్వులిచ్చింది. డిసెంబర్ 31వ తేదీతో గడువు ముగియనుండగా, జనవరి 1 నుంచి మార్చి 31వ తేదీ వరకు అక్రిడేషన్లు పనిచేస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు, ఆర్టీసీ సంస్థకు అధికారులు తెలియజేశారు.