News July 15, 2024

మెస్సీ ప్రపంచ రికార్డు

image

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ వరల్డ్ రికార్డు సృష్టించారు. ఇవాళ కోపా అమెరికా <<13631595>>టైటిల్<<>> గెలుపుతో అత్యధిక ట్రోఫీలను(45) సొంతం చేసుకున్న ప్లేయర్‌గా ఘనత సాధించారు. ఇందులో 39 డొమెస్టిక్, క్లబ్ టైటిల్స్ కాగా, మిగతావి ఇంటర్నేషనల్, వరల్డ్ కప్ ట్రోఫీలు. ఈ జాబితాలో అల్వెస్‌-బ్రెజిల్(43), అషూర్-ఈజిప్ట్(39) టైటిల్స్‌తో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కెరీర్‌లో 1,068 మ్యాచ్‌లు ఆడిన మెస్సీ 838 గోల్స్ చేశారు.

Similar News

News November 28, 2025

నేడే రాజధానిలో 15 బ్యాంకులకు శంకుస్థాపన

image

AP: రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు పడనుంది. దేశంలోని 15 ప్రముఖ బ్యాంకులు, బీమా సంస్థలు రాజధానిలో తమ ఆఫీసులు ఏర్పాటు చేసుకుంటున్నాయి. వీటికి ఈ ఉదయం 11.22గంటలకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, CM CBN చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. రూ.1,334 కోట్లతో నిర్మాణాలు చేపట్టనున్నారు. ఆయా బ్యాంకులు, బీమా సంస్థల ప్రతినిధులు, మంత్రులు, రాజధాని రైతులు హాజరుకానున్నారు.

News November 28, 2025

కయ్యానికి కాలు దువ్వుతున్న నేపాల్

image

భారత భూభాగాలను తమవిగా పేర్కొంటూ నేపాల్ కయ్యానికి కాలు దువ్వుతోంది. ఆ దేశం రూ.100 నోట్లను రిలీజ్ చేయగా, వాటిపై కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలు తమవే అన్నట్లు మ్యాప్‌ను ముద్రించింది. 2020లో అప్పటి PM కేపీ శర్మ ఓలీ మ్యాప్‌ను సవరించగా, దాన్ని ఇప్పుడు నోట్లపై ప్రింట్ చేశారు. ఈ చర్యను ఖండించిన భారత్.. ఆ 3 ప్రాంతాలు IND అంతర్భాగాలని పేర్కొంది. నేపాల్ నిర్ణయం ఆమోదయోగ్యం కాదని చెప్పింది.

News November 28, 2025

బతుకమ్మ కుంటపై HCకు హాజరవుతా: రంగనాథ్

image

TG: బతుకమ్మ కుంట వివాదంలో DEC 5వ తేదీలోపు కోర్టు ముందు హాజరు కావాలని, లేకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హైడ్రా రంగనాథ్‌ను HC ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘నాపై ఇప్పటికే 30కి పైగా కేసులున్నాయి. కబ్జాదారులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. లీగల్‌గా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చెరువులను అభివృద్ధి చేస్తాం. బతుకమ్మ కుంటపై కోర్టుకు హాజరై అన్ని విషయాలు వివరిస్తాం’ అని చెప్పారు.