News February 15, 2025

5 ఖండాలను లింక్ చేస్తూ మెటా కేబుల్.. భారత్ కీ రోల్!

image

భారత్ సాయంతో ప్రపంచంలో అతి పొడవైన సముద్ర కేబుల్ వేసేందుకు మెటా కంపెనీ ప్లాన్ చేస్తోంది. 5 ఖండాలను లింక్ చేస్తూ 50వేల కి.మీ మేర సముద్రం లోపల కేబుల్ వేయనున్నట్లు మెటా ప్రకటించింది. ఈ ప్రాజెక్టు విలువ 10 బిలియన్ డాలర్లు అని, ఏఐ సర్వీసులు, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరుస్తామని వెల్లడించింది. ఈ ప్రాజెక్టు మెయింటనెన్స్, ఫైనాన్సింగ్‌లో భారత్ కీలకపాత్ర పోషించనుంది.

Similar News

News December 7, 2025

వాళ్లు నా లైఫ్‌లో ఉన్నందుకు ఆనందిస్తున్నా: ఆమిర్ ఖాన్

image

రీనా దత్తా, కిరణ్ రావుతో డైవర్స్ తీసుకుని భార్యాభర్తలుగా విడిపోయామే తప్పా మనుషులుగా కాదని బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ చెప్పారు. వారంటే ప్రేమ, గౌరవం ఉన్నాయన్నారు. ‘రీనాను చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నా. ఇద్దరం కలిసే లైఫ్‌లో ఎదిగాం. 2వ భార్య కిరణ్‌ అద్భుతమైన వ్యక్తి. ఆమె పేరెంట్స్ మేమంతా కుటుంబం. గర్ల్ ఫ్రెండ్ గౌరి అనుకోకుండా వచ్చిన అదృష్టం. వాళ్లు లైఫ్‌లో ఉన్నందుకు ఆనందిస్తున్నా’ అని చెప్పారు.

News December 7, 2025

పిల్లల్లో ఊబకాయాన్ని ఎలా తగ్గించాలంటే?

image

ప్రస్తుత కాలంలో చిన్నారుల్లో కూడా ఊబకాయం పెరుగుతోంది. దీనివల్ల వారికి భవిష్యత్తులో ఎన్నో సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ఇలా కాకుండా ఉండాలంటే..మెరుగైన, పోషకాలతో నిండిన ఆహారాన్ని పిల్లలకు అందించడం చాలా మంచిది. ఆన్​లైన్​లో దొరికే అధిక కేలరీల ఫుడ్స్​ని వీలైనంత వరకు దూరంగా ఉంచాలి. పిల్లలకు రోజుకు అరగంటైనా శారీరక శ్రమ ఉండాలి. అలాగే వారు ఒత్తిడికి గురవకుండా చూసుకోవడం ముఖ్యమంటున్నారు.

News December 7, 2025

స్కూల్‌పై దాడి.. 43 మంది చిన్నారులు మృతి

image

సుడాన్‌లో ఆర్మీ, రెబల్స్(పారా మిలిటరీ) మధ్య ఆధిపత్య పోరులో వేలాది మంది అమాయకులు చనిపోతున్నారు. తాజాగా ఆర్మీ కంట్రోల్‌లో ఉన్న కలోగిపై రెబల్స్ చేసిన డ్రోన్ దాడిలో 79 మంది మరణించారు. వీరిలో 43 మంది చిన్న పిల్లలు ఉన్నారు. మరో 38 మంది గాయపడ్డారు. రెబల్స్ తొలుత కిండర్‌గార్టెన్(స్కూల్), ఆస్పత్రిపై దాడి చేశారు. పిల్లలను రక్షించేందుకు బలగాలు ప్రయత్నిస్తుండగా మళ్లీ అటాక్ చేసినట్లు అధికారులు తెలిపారు.