News September 2, 2024

ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక

image

ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సెప్టెంబర్ 5వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని, కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకొని ఇది ఉంటుందని పేర్కొంది. ఇప్పటికే వర్షాలు, వరదలకు అనేక ప్రాంతాలు నీట మునిగి తీవ్ర అవస్థలు పడుతున్న ప్రజలు తాజా హెచ్చరికలతో మరింత ఆందోళన చెందుతున్నారు.

Similar News

News November 6, 2025

స్టైలింగ్ ఇలా మార్చుకోండి

image

చాలామంది అమ్మాయిలు ఎన్ని దుస్తులున్నా వేసుకోవడానికి ఏవీ లేవని ఫీల్ అవుతుంటారు. మీ స్టైలింగ్ కాస్త మారిస్తే మీ వార్డ్‌రోబ్ కొత్తగా కనిపిస్తుందంటున్నారు నిపుణులు. ఉన్నవాటినే రంగులూ, డిజైన్లవారీగా విభజించి మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకోవచ్చు. ట్రెండీ దుస్తులు కాకుండా మీ ఒంటి తీరుకు ఏవి నప్పుతాయో చూసుకొని మీకంటూ ఓ స్టైల్ స్టేట్మెంట్ క్రియేట్ చేసుకోండి. అప్పుడే మీరేం వేసినా ఇతరులకంటే భిన్నంగా కనిపిస్తారు.

News November 6, 2025

బీస్ట్ మోడ్‌లోకి ఎన్టీఆర్.. లుక్‌పై నీల్ ఫోకస్!

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బీస్ట్ మోడ్‌లోకి మారనున్నారు. ‘NTR-NEEL’ మూవీ కోసం ఆయన లుక్ పూర్తిగా మారబోతుందని మేకర్స్ ట్వీట్ చేశారు. త్వరలో నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. తన సినిమాలో ఎన్టీఆర్ హెయిర్ స్టైల్, బియర్డ్‌ ఎలా ఉండాలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దగ్గరుండి హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్‌తో సెట్ చేయించారు. తారక్ లుక్ విషయంలో కాంప్రమైజ్ కావొద్దని ఫ్యాన్స్ కోరుతున్నారు.

News November 6, 2025

226 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు.. అప్లై చేసుకున్నారా?

image

ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ& రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌(<>IGMCRI<<>>)లో 226 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. నర్సింగ్ డిగ్రీ, డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్, మిడ్ వైఫరీ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. వయసు 18 -35ఏళ్ల మధ్య ఉండాలి. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.250, SC, STలకు రూ.125. వెబ్‌సైట్: https://igmcri.edu.in/