News February 9, 2025

బెంగళూరులో మెట్రో ఛార్జీలు 50% పెంపు!

image

బెంగళూరులో మెట్రో ట్రైన్ ఛార్జీలు పెరిగాయి. టికెట్ ధర కనిష్ఠంగా రూ.10, గరిష్ఠంగా రూ.90గా ఉంది. గరిష్ఠ టికెట్ ధరను రూ.60 నుంచి రూ.90కి పెంచారు. ఈ పెంపు నేటి నుంచి అమల్లోకి రానుంది. 0-2kmsకి రూ.10, 2-4kmsకి 20, 6-8kms 40, 8-10kms 50, 20-25kms 80, 25-30kmsకి 90 ఛార్జ్ చేస్తారు. స్మార్ట్ కార్డులపై 5% డిస్కౌంట్‌ను కొనసాగించనున్నారు. కాగా ఇటీవల కర్ణాటకలో ఆర్టీసీ ఛార్జీలను 15% పెంచిన సంగతి తెలిసిందే.

Similar News

News December 5, 2025

VIRAL: ఫ్లైట్స్ క్యాన్సిల్.. లగేజీ కోసం తిప్పలు!

image

400కు పైగా ఇండిగో విమానాలు రద్దవడంతో బెంగళూరులోని కెంపేగౌడ విమానాశ్రయంలో గందరగోళం నెలకొంది. తిరిగి ఇంటికెళ్లాల్సిన ప్రయాణీకులు తమ లగేజీ ఎక్కడుందో వెతుక్కునేందుకు ఇబ్బంది పడ్డారు. వందల సంఖ్యలో బ్యాగులు ఒకేచోట ఉంచడంతో తమ వస్తువుల జాడ కోసం ప్రయాణీకుల పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఎయిర్‌లైన్స్ యాజమాన్యంపై కొందరు ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

News December 5, 2025

వినూత్న విద్యతోనే పిల్లల భవిష్యత్: సీఎం చంద్రబాబు

image

AP: పిల్లలు వినూత్న కార్యక్రమాలకు ముందుండాలని, వారి ప్రతిభను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసి లోపాలను వెంటనే సరిచేయాలని CM చంద్రబాబు ఉపాధ్యాయులు, పేరెంట్స్‌కు చెప్పారు. పార్వతీపురం మన్యం(D) భామినిలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లో CM పాల్గొని మాట్లాడారు. చదువుతో పాటు ఆటలు, పాటలు కూడా అవసరమని అభిప్రాయపడ్డారు. పిల్లల బలాలు, బలహీనతలు గుర్తించి అన్ని సబ్జెక్టుల్లో బలమైన పునాది వేయాలని సూచించారు.

News December 5, 2025

క్షమాపణ కోరిన రంగనాథ్

image

TG: హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టుకు హాజరయ్యారు. బతుకమ్మ కుంట వివాదంలో న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించినందుకు క్షమాపణ కోరారు. ఆ స్థలంలో యథాతథస్థితి కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులివ్వగా రంగనాథ్ ఉల్లంఘించారంటూ సుధాకర్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించినా కమిషనర్ వెళ్లలేదు. దీంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించడంతో రంగనాథ్ కోర్టుకు వెళ్లారు.