News November 16, 2024
మెట్రో రెండో దశ భూసేకరణకు ఆమోదం

TG: మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ నిర్మాణానికి ముందడుగు పడింది. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణ గుట్ట వరకు మెట్రో నిర్మాణానికి భూసేకరణకు కలెక్టర్ ఆమోదం తెలిపారు. దీంతో భూసేకరణ పనులు ప్రారంభం కానున్నాయి. సీఎం ఆదేశాలతో ఇప్పటికే ఈ మార్గంలోని 200లకు పైగా ఆస్తులకు డిక్లరేషన్ ఇచ్చారు. ఆస్తుల సేకరణ పూర్తయ్యాక డిసెంబర్‌లో అవార్డు ఆమోదం పొందుతుంది. జనవరిలో మెట్రో రైలు పనులు ప్రారంభమవుతాయని కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News March 23, 2026
దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు

TG: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న MLA దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దానం పార్టీ మారలేదన్న స్పీకర్ నిర్ణయాన్ని బీజేపీ MLA ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చింది. దీనిపై 4 వారాల్లో వివరణ ఇవ్వాలని దానంతోపాటు అసెంబ్లీ సెక్రటరీకి ఉన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను వచ్చే నెల 16వ తేదీకి వాయిదా వేసింది.
News March 23, 2026
భద్రాద్రి రాముడిపై పంచాయితీ.. ఏంటీ వివాదం?

TG: భద్రాద్రి రామయ్యను దశరథ పుత్రుడిగా, వశిష్ట గోత్రికుడిగా, సీతమ్మది గౌతమస గోత్రంగా వ్యవహరించేవారు. 2012 తర్వాత అక్కడ ఉన్నది రామనారాయణుడంటూ గోత్రాన్ని ‘అచ్యుత’గా, సీతాదేవి గోత్రాన్ని ‘సౌభాగ్య’గా పండితులు చదువుతున్నారంటూ ఓ వ్యక్తి 2022లో హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఏర్పాటుచేసిన కమిటీ 2024లో దేవదాయ శాఖకు నివేదిక సమర్పించింది. అది బయటికి రాకపోవడంతో మళ్లీ కోర్టుకెక్కారు. ఇవాళ విచారణ జరగనుంది.
News March 23, 2026
IPL: 2020 నుంచి అత్యధిక వికెట్లు వీరికే

పరుగుల వరద పారే IPLలో కొందరు బౌలర్లు మ్యాజిక్ స్పెల్స్ వేస్తూ వికెట్లు పడగొడుతుంటారు. అలా సత్తా చాటి 2020 నుంచి 100+ వికెట్లు తీసిన బౌలర్లు ఐదుగురు ఉన్నారు.
➤ చాహల్: 121
➤ హర్షల్ పటేల్: 108
➤ ట్రెంట్ బోల్ట్: 105
➤ రషీద్ ఖాన్: 103
➤ బుమ్రా: 101
– ఇక IPLలో మొత్తంగా చాహల్ 221 వికెట్లు తీశారు.


