News December 30, 2024

రేపు అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు

image

TG: నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ మెట్రో రైళ్లు అర్ధరాత్రి వరకు సేవలందించనున్నాయి. రాత్రి గం.12:30కి చివరి రైలు బయల్దేరుతుందని HMRL వర్గాలు వెల్లడించాయి. అర్థరాత్రి వరకు వేడుకలు ఉండటంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు విస్తృతంగా జరిగే అవకాశం ఉండటంతో సేఫ్‌గా ఇంటికి చేరేందుకు ఇది సహకరించనుంది. ఇక నగరంలో రేపు రాత్రి ఫ్లై ఓవర్లు మూసేస్తామని పోలీసులు తెలిపారు.

Similar News

News January 2, 2025

క్రీడల్లో ప్రతిభకు ప్రతిష్ఠాత్మక పురస్కారం

image

క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభకు గుర్తింపుగా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును ప్రదానం చేస్తారు. 1991-92 నుంచి ఈ పురస్కారాన్ని ప్రకటిస్తున్నారు. నాలుగేళ్ల వ్యవధిలో క్రీడాకారుల ప్రదర్శన ఆధారంగా క్రీడల మంత్రిత్వ శాఖ అవార్డులకు ఎంపిక చేస్తుంది. ఎంపికైన వారికి మెడ‌ల్‌, స‌ర్టిఫికెట్‌తోపాటు ₹25 ల‌క్ష‌ల న‌గ‌దు బ‌హుమ‌తిని అందిస్తారు. ఈ <<15045667>>ఏడాది<<>> మనూభాకర్, గుకేశ్, ప్రవీణ్ కుమార్, హర్మన్‌ప్రీత్‌లను వరించింది.

News January 2, 2025

బుల్స్ జోరు.. కొత్త ఏడాది హుషారు

image

కొత్త ఏడాది ఇన్వెస్ట‌ర్ల‌లో జోష్ నింపిన‌ట్టు క‌నిపిస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలు గ‌డించాయి. Sensex 1,436 పాయింట్ల లాభంతో 79,943 వ‌ద్ద‌, Nifty 445 పాయింట్లు ఎగ‌సి 24,188 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. అన్ని రంగాల షేర్ల‌కు కొనుగోళ్ల మ‌ద్ద‌తు ల‌భించింది. ఆటో రంగ షేర్లు అత్య‌ధికంగా 3.79% లాభ‌ప‌డ్డాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఐటీ, ఎఫ్ఎంసీజీ, మెట‌ల్‌, ఫార్మా, రియ‌ల్టీ రంగ షేర్లు రాణించాయి.

News January 2, 2025

‘పుష్ప’ను అరెస్టు చేసి రేవంత్ పాన్ ఇండియా సీఎం అయ్యారు: MP

image

TG: అల్లు అర్జున్ అరెస్టుపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పుష్ప’ను అరెస్టు చేసి రేవంత్ రెడ్డి పాన్ ఇండియా సీఎం అయ్యారని వ్యాఖ్యానించారు. ఇక KCRలా తాము ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలనుకోవడం లేదని, బలమైన ప్రతిపక్షం ఉండాలనుకుంటున్నామని చెప్పారు.