News July 14, 2024
హయత్ నగర్ వరకు త్వరలో మెట్రో సేవలు: సీఎం రేవంత్

TG: పేదలకు కార్పొరేట్ విద్య, వైద్యం అందించాలని ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ పథకాలను కాంగ్రెస్ తెచ్చిందని సీఎం రేవంత్ తెలిపారు. కాటమయ్య కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన శంషాబాద్ ఎయిర్పోర్టు, ORR నిర్మాణాల వల్ల రంగారెడ్డి జిల్లా భూముల విలువ పెరిగిందన్నారు. త్వరలోనే హయత్ నగర్ వరకు మెట్రోను విస్తరిస్తామని చెప్పారు.
Similar News
News December 6, 2025
అఖండ-2 వచ్చే ఏడాదేనా?

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ-2 సినిమా వచ్చే ఏడాదిలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బుక్ మై షోలో 2026లో రిలీజ్ అని చూపించడంతో ఈ ఏడాది విడుదలకు అవకాశాలు తక్కువేనని తెలుస్తోంది. మరోవైపు క్రిస్మస్కు వచ్చే ఛాన్స్ ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే విడుదల తేదీపై చిత్ర నిర్మాణ సంస్థ ’14 రీల్స్’ మాత్రం ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ సంక్రాంతికి వస్తే పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.
News December 6, 2025
మద్యం అమ్మకాలు.. ఐదురోజుల్లో రూ.940 కోట్లు

TG: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు రికార్డులు నమోదు చేస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలు, కొత్త వైన్స్ ప్రారంభం కావడంతో అమ్మకాలు పెరిగాయి. డిసెంబర్ 1-5 వరకు డిపో నుంచి ఏకంగా రూ.940 కోట్ల మద్యం లిఫ్ట్ అయ్యింది. DEC 1 నుంచి అమ్మకాలు చూస్తే.. రూ.183.05 కోట్లు, రూ.207.49 కోట్లు, రూ.187.52 కోట్లు, రూ.178.29 కోట్లు, రూ.185.02 కోట్ల బిజినెస్ జరిగింది. బీర్ల కంటే విస్కీ, బ్రాందీ, రమ్ము ఎక్కువగా అమ్ముడవుతున్నాయి.
News December 6, 2025
దైవ ప్రసాదంతో ఈ తప్పులు వద్దు

ప్రసాదం ఆహారం మాత్రమే కాదు. అది దైవాశీర్వాదం కూడా! మిగిలిన ప్రసాదాన్ని ఎప్పుడూ వృథా చేయకూడదు. ప్రసాదాన్ని వీలైనంత ఎక్కువ మందికి పంచాలి. ఇతరులకు పంచాకే తినాలి. ప్రసాదం చెడిపోయే వరకు నిల్వ ఉంచకూడదు. ఒకవేళ అలా జరిగితే.. చెత్త బుట్టల్లో అస్సలు పడేయకూడదు. బదులుగా చెట్టు, మొక్కల మొదట్లో ఉంచాలి. తీర్థాలను కూడా కింద పారబోయరాదు. నేరుగా తాగరాదు. చేతిలోకి తీసుకున్నాకే స్వీకరించాలి.


