News June 18, 2024
సంగారెడ్డి వరకు మెట్రో విస్తరించాలి: MP రఘునందన్
TG: మెట్రో రైలు సేవలను మియాపూర్ నుంచి పటాన్‌చెరుకు, ఆ తర్వాత సంగారెడ్డి వరకు విస్తరించాలని మెదక్ MP రఘునందన్ రావు కోరారు. ఈ మేరకు మెట్రో MD NVS రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. స్పందించిన MD త్వరలో గ్రౌండ్ రిపోర్ట్ ఇస్తామని హామీ ఇచ్చారు. 6 నెలల్లోపు శంకుస్థాపన కోసం కేంద్రాన్ని ఒప్పించాలని MP లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. సంగారెడ్డి వరకు మెట్రో విస్తరణపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి?
Similar News
News January 18, 2025
ఆ రోజున కుంభమేళాకు 10 కోట్ల మంది వచ్చే అవకాశం: యోగీ
ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాకు ఈ నెల 29 అమవాస్య రోజున 8-10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని UP సీఎం యోగీ ఆదిత్యనాథ్ అంచనా వేశారు. అందుకు అనుగుణంగా మరిన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఘాట్ల వద్ద బారికేడ్ల ఏర్పాటు, 24 గంటల విద్యుత్, నీటి సరఫరా, అత్యున్నత స్థాయి భద్రత ఉండాలని తెలిపారు. అమవాస్య రోజు కావడంతో భక్తులు పుణ్యస్నానానికి పోటెత్తుతారని పేర్కొన్నారు.
News January 18, 2025
ఈ ఏడాది గరిష్ఠంగానే భారత్ వృద్ధి రేటు: IMF
ఈ ఏడాదికిగానూ ప్రపంచదేశాల వృద్ధి రేటు అంచనాలతో ఐఎంఎఫ్ ప్రకటన విడుదల చేసింది. గత ఏడాది భారత వృద్ధి రేటు గరిష్ఠంగా 6.5గా ఉండగా ఈ ఏడాదీ అదే కొనసాగుతుందని అంచనా వేసింది. మరోవైపు అడ్వాన్స్‌డ్ ఎకానమీగా పేరొందిన USA వృద్ధి రేటు 2.7గా ఉండొచ్చని పేర్కొంది. మధ్య ఆదాయ, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 4.2గా అల్ప ఆదాయ దేశాల్లో 4.6గా వృద్ధి రేటు ఉండే అవకాశం ఉందని వెల్లడించింది.
News January 18, 2025
సైఫ్‌పై దాడిలో ఆధారాలు గుర్తింపు: ఫడ్నవీస్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి ఘటనలో పోలీసులు కొన్ని ఆధారాలను గుర్తించినట్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడి చిత్రాలను స్పష్టంగా కనుగొన్నట్లు పేర్కొన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, అతి త్వరలోనే నిందితుడిని పోలీసులు పట్టుకుంటారని చెప్పారు. కాగా బాలీవుడ్ స్టార్లపై వరుస దాడుల నేపథ్యంలో మహా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.