News April 11, 2025
ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో: సీఎం రేవంత్

TG: ఫ్యూచర్ సిటీ వరకు మెట్రోను విస్తరించాలని, అందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. మెట్రో రెండో దశ విస్తరణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష తీశారు. మొత్తం 76.4KMల విస్తరణకు రూ.24,269 కోట్ల అంచనాలతో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం DPR పంపింది. కేంద్రం నుంచి పర్మిషన్ రాగానే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
Similar News
News April 18, 2025
కాలేయ ఆరోగ్యం: ఈ సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త!

శరీరంలోని మలినాల్ని శుభ్రం చేయడంలో లివర్‌దే ప్రధాన పాత్ర. అంతటి కీలకమైన లివర్లో ఏదైనా సమస్య తలెత్తితే కనిపించే కొన్ని లక్షణాలు:
-> కడుపునిండా తింటూ కంటినిండా నిద్రపోతున్నా నీరసంగానే అనిపిస్తుండటం, తరచూ కామెర్లు రావడం, కళ్లు, చర్మం పసుపురంగులో ఉండటం, విరోచనాల రంగులో మార్పు, పొట్టకు కుడివైపు పైన నొప్పి రావడం, వాంతులు, కాళ్లు-మడమల్లో వాపు ఉంటే లివర్ టెస్ట్ చేయించుకోవాలి.
*రేపు కాలేయ ఆరోగ్య దినోత్సవం
News April 18, 2025
అమెరికా వైమానిక దాడి.. యెమెన్‌లో 74 మంది మృతి

యెమెన్‌లోని ఆయిల్ పోర్టుపై US చేసిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 74కు చేరింది. ఈ ఘటనలో 171 మంది గాయపడినట్లు హౌతీ గ్రూప్ వెల్లడించింది. నెలరోజులుగా జరుగుతున్న దాడుల్లో ఇదే అత్యంత దారుణమైన దాడి అని తెలిపింది. కాగా ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణిస్తున్న నౌకలపై హౌతీల దాడులను ట్రంప్ సీరియస్‌గా తీసుకున్నారు. వారికి నరకాన్ని చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఆదేశాలతో US ఆర్మీ హౌతీలపై విరుచుకుపడుతోంది.
News April 18, 2025
నటుడిపై ఫిర్యాదు వెనక్కి తీసుకుంటా: నటి

అసభ్యంగా ప్రవర్తించాడంటూ మలయాళ నటి విన్సీ అలోషియస్ ఓ నటుడిపై ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అది టామ్ చాకో అని బయటికి రావడంతో ఫిర్యాదును వెనక్కి తీసుకోనున్నట్లు తెలిపారు. ‘నేను అధికారుల్ని నమ్మాను. అతడి పేరు బయటికి రావొద్దని స్పష్టంగా చెప్పాను. అయినా పేరును లీక్ చేశారు. ప్రతిభావంతుడైన నటుడికి సినిమాల్లో అవకాశాలు ఆగకూడదు. తన తప్పును సరిదిద్దుకుంటాడన్నదే నా ఆశ’ అని పేర్కొన్నారు.