News March 26, 2024

చేవెళ్లకు మెట్రో రైలు రావొచ్చు: రేవంత్

image

TG: కాంగ్రెస్ చేవెళ్ల పార్లమెంట్ సన్నాహక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం కష్టపడినవారికి బాధ్యతలు అప్పగిస్తానని అన్నారు. పార్టీని నమ్ముకుని పనిచేస్తేనే ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. ఎంపీల బలముంటే ప్రాణహిత చేవెళ్ల పూర్తి చేసుకోవచ్చన్నారు. చేవెళ్లకు మెట్రో రైలు కూడా తీసుకురావొచ్చని అభిప్రాయపడ్డారు.

Similar News

News March 30, 2026

4 లక్షల చాక్లెట్స్ చోరీ.. కంపెనీ ఫన్నీ రియాక్షన్!

image

4.14 లక్షల చాక్లెట్లు చోరీ కావడంపై నెస్లే బ్రాండ్ ‘కిట్ క్యాట్’ ఫన్నీగా స్పందించింది. ‘కిట్‌క్యాట్‌తో బ్రేక్ తీసుకోమని మేం చెబుతుంటాం. కానీ ఈ దొంగలు మా స్లోగన్‌ను మరీ సీరియస్‌గా తీసుకున్నారు. ఏకంగా 12 టన్నుల చాక్లెట్లతో బ్రేక్ తీసుకున్నారు’ అని పేర్కొంది. మార్చి 26న చాక్లెట్ల లోడుతో ఇటలీ నుంచి పోలండ్ వెళ్తున్న ట్రక్కు మార్గమధ్యంలో మాయమైపోయింది. ఇప్పటికీ దాని ఆచూకీ తెలియరాలేదని నెస్లే తెలిపింది.

News March 30, 2026

నామినేషన్ వేసిన CM స్టాలిన్, విజయ్

image

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ కొలత్తూరు నుంచి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నామినేషన్ దాఖలు చేశారు. అటు తమిళగ వెట్రి కళగం(TVK) అధినేత, నటుడు విజయ్ దళపతి కూడా పెరంబూరు నియోజకవర్గానికి సంబంధించి చెన్నైలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

News March 30, 2026

చైనా సీసీటీవీలపై దేశంలో బ్యాన్?

image

ఏప్రిల్ 1 నుంచి హిక్‌విజన్, దహువా, TP-Link తదితర చైనా CCTV కెమెరాలు, పరికరాలను దేశంలో బ్యాన్ చేయనున్నట్లు తెలుస్తోంది. దేశంలో అమ్మే CCTV ప్రొడక్టులు కచ్చితంగా అనుమతి తీసుకోవాలని కేంద్రం కొత్త రూల్ తీసుకొచ్చింది. భద్రతా చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో చైనా సంస్థలు, ఆ దేశంలో తయారైన చిప్‌సెట్‌లను ఉపయోగించే పరికరాలకు పర్మిషన్ ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నట్లు సమాచారం.