News May 18, 2024
యథావిధిగానే మెట్రో ప్రయాణ వేళలు: L&T
TG: మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పులు చేశారంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని ఎల్ అండ్ టీ అధికారులు తెలిపారు. మెట్రో రాకపోకల్లో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేశారు. కానీ ప్రయాణ వేళల్లో మార్పుపై పరిశీలన చేస్తున్నామని పేర్కొన్నారు. దీనిపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని వివరించారు. యథావిధిగానే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో రైళ్లు నడుస్తాయని పేర్కొన్నారు.
Similar News
News December 22, 2024
AA ఇంటిపై దాడి వెనుక కాంగ్రెస్ కుట్ర?: కిషన్ రెడ్డి
TG: రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి వెనుక కాంగ్రెస్ నేతల కుట్ర ఏమైనా ఉందా అని అనుమానం వ్యక్తం చేశారు. సినీ ఇండస్ట్రీని లక్ష్యంగా చేసుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మండిపడ్డారు.
News December 22, 2024
ట్రెండింగ్లో #StopCheapPoliticsOnAA
తొక్కిసలాట ఘటనను కారణంగా చూపిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను లక్ష్యంగా చేసుకోవడాన్ని SMలో ఆయన అభిమానులు తప్పుబడుతున్నారు. కావాలనే AAను టార్గెట్ చేస్తూ దాడులకు దిగుతున్నారని పోస్టులు చేస్తున్నారు. దిష్టి బొమ్మ దహనం, ఇంటిపై దాడి అందులో భాగమేనని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా బన్నీని లక్ష్యంగా చేసుకోవడం ఆపాలని కోరుతున్నారు. ఈ క్రమంలో #StopCheapPoliticsOnALLUARJUN ను ట్రెండ్ చేస్తున్నారు.
News December 22, 2024
రూ.5,000 కోట్లతో జెఫ్ బెజోస్ మళ్లీ పెళ్లి
అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ మరోసారి పెళ్లిపీటలెక్కుతున్నారు. ఈ నెల 28న తన గర్ల్ ఫ్రెండ్ లారెన్ సాంచెజ్ను ఆయన వివాహమాడతారు. ఈ వేడుకను రూ.5,000 (600 మిలియన్ల డాలర్లు) కోట్ల ఖర్చుతో కొలరాడోలో గ్రాండ్గా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వీరి పెళ్లికి అతిరథ మహారథులను ఆహ్వానిస్తారని సమాచారం. కాగా బెజోస్ గతంలో మెకంజీ స్కాట్ను పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చారు. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు.