News February 12, 2025
MF: JANలో రూ.40వేల కోట్ల పెట్టుబడులు

స్మాల్, మిడ్‌క్యాప్ స్టాక్స్ వాల్యుయేషన్లు అధికంగా ఉన్నాయంటూ వార్నింగ్ ఇస్తున్నా ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్లపై నమ్మకం ఉంచారు. JANలో MFలో రూ.39,687 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. స్మాల్‌క్యాప్ ఫండ్లలో పెట్టుబడులు 22.6% పెరిగి రూ.5,720CRతో రికార్డు గరిష్ఠానికి చేరాయి. మిడ్‌క్యాప్‌లో రూ.5147 CR, లార్జ్‌క్యాప్‌లో రూ.3,063 CR కుమ్మరించారు. 5 నెలలుగా మార్కెట్ పడుతున్నా క్రమశిక్షణ కనబరుస్తున్నారు.
Similar News
News October 21, 2025
ఇతిహాసాలు క్విజ్ – 42 సమాధానాలు

1. వాలి ఇంద్రుడి అంశతో జన్మించాడు.
2. కర్ణుడి అంత్యక్రియలను యుధిష్ఠిరుడు నిర్వహించాడు.
3. జ్ఞానానికి, విద్యకు అధిదేవత సరస్వతీ దేవి.
4. త్రిమూర్తులలో లయకారుడు ‘శివుడు’.
5. వాయు లింగం శ్రీకాళహస్తి ఆలయంలో ఉంది.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 21, 2025
మీ జుట్టు పొడిబారిందా? ఇలా చేయండి

థైరాయిడ్, PCOS, డయాబెటిస్ వల్ల చర్మం, జుట్టూ పొడిబారుతుంది. దీన్ని నివారించడానికి గాఢత తక్కువగా ఉండే షాంపూలను వాడాలని డెర్మటాలజిస్టులు సూచిస్తున్నారు. ‘సల్ఫేట్ ఫ్రీ ఫార్ములా ఉన్న మాయిశ్చరైజింగ్ షాంపూలను ఎంపిక చేసుకోవాలి. ప్రొడక్టుల్లో హైలురనిక్ యాసిడ్, స్క్వాలిన్ వంటివి ఉండేలా చూసుకోవాలి. చుండ్రు నివారణకు కీటోకొనజాల్, సెలీనియం సల్ఫైడ్, సాల్సిలిక్ యాసిడ్ ఉన్న లోషన్లను వాడాలి’ అని చెబుతున్నారు.
News October 21, 2025
‘స్పర్శే ఔషధం’.. పిల్లలను తాకితే!

శిశువును తల్లిదండ్రులు తమ ఛాతిపై పడుకోబెట్టుకుంటే బంధం పెరగడమే కాక మెదడు ఆరోగ్యానికి గొప్ప ఔషధంగా పనిచేస్తుందని న్యూరాలజిస్టులు తెలిపారు. ఈ స్పర్శ ద్వారా ముందస్తు శిశువుల మెదడులో భావోద్వేగం, దృష్టికి మద్దతిచ్చే కనెక్షన్లు బలంగా మారుతున్నట్లు MRI స్కాన్లలో తేలినట్లు వెల్లడించారు. శిశువులలో రోజూవారీ 30-60 నిమిషాల స్పర్శ చాలా మార్పు తీసుకొస్తుందని, ఈ పద్ధతి చాలా సురక్షితమని పేర్కొన్నారు.