News November 7, 2025

MGBS నుంచి పంచ శైవక్షేత్రాలకు స్పెషల్ బస్సులు

image

కార్తీకమాసం సందర్భంగా పంచశైవక్షేత్రాల దర్శనానికి స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు TGSRTC అధికారులు వెల్లడించారు. అమరావతి అమరలింగేశ్వరస్వామి, భీమవరం సోమేశ్వరస్వామి, ద్రాక్షారామం భీమేశ్వరస్వామి, సామర్లకోట భీమలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించేలా బస్సు సేవలు తీసుకొచ్చారు. ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు MGBS నుంచి బస్సు బయలుదేరుతంది. తిరిగి మంగళవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకోవచ్చు.
SHARE IT

Similar News

News November 7, 2025

KNR: అధికారుల కక్కుర్తి.. ‘డీజిల్ BILLSలో చేతివాటం’

image

KNR మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏటా వాహనాల నిర్వహణకు రూ.2 కోట్లకుపైగా డీజిల్‌పై ఖర్చు చేస్తుంటారు. కాగా డీజిల్ డబ్బులు పక్కదారి పడుతున్నాయన్న విమర్శలున్నాయి. ముఖ్యంగా ఆయా విభాగాల అధికారులు తమ సొంతవాహనాల్లో మున్సిపల్ డీజిల్ వాడుతూ అద్దెవాహనాల కింద బిల్లులు డ్రా చేస్తున్నారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. అలాగే మున్సిపల్ వాహనాల్లో ఒక ట్రిప్ వేసి రెండు ట్రిప్పుల బిల్లులు రికార్డు చేస్తున్నట్లు సమాచారం.

News November 7, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

image

నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ కాస్త తగ్గి కొనుగోలుదారులకు ఉపశమనాన్నిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.550 తగ్గి రూ.1,22,020కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.470 పతనమై రూ.1,11,880 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 7, 2025

సూర్య బ్యాడ్ ఫామ్.. 18 ఇన్నింగ్సుల్లో నో ఫిఫ్టీ!

image

IND టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. అతడు గత 18 టీ20ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయారు. 7 సార్లు(+3 డకౌట్లు) సింగిల్ డిజిట్ స్కోర్‌కే ఔటయ్యారు. అత్యధిక స్కోర్ 47*. కెప్టెన్సీ భారం వల్లే సూర్య ఫెయిల్ అవుతున్నారా? లేదా బ్యాటింగ్ ఆర్డర్‌లో పదేపదే మార్పుల వల్ల విఫలం అవుతున్నారా? అనే చర్చ మొదలైంది. వచ్చే ఏడాది T20WC నేపథ్యంలో సూర్య ఫామ్ అందుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.