News September 9, 2025
MGMలో ప్రారంభమైన కాన్సర్ కేర్ సెంటర్

వరంగల్ ఎంజైమ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన పది పడకల జిల్లా కాన్సర్ కేర్ సెంటర్‌ను మంత్రి దామోదర రాజనరసింహ వర్చువల్‌గా నేడు ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు క్యాన్సర్ చికిత్సను సమీప ప్రాంతంలోనే అందించాలన్న ఉద్దేశ్యంతో ఈ సెంటర్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News September 10, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 10, బుధవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.51 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.03 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.13 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.37 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.22 గంటలకు
✒ ఇష: రాత్రి 7.35 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News September 10, 2025
నేడు అనంతపురానికి డిప్యూటీ CM.. షెడ్యూల్ ఇదే!

★ బుధవారం ఉ.11.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి విమానంలో పుట్టపర్తికి బయలుదేరుతారు.
★ మ.12.30కి పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారు.
★ మ.12.40కి హెలికాప్టర్‌లో అనంతపురానికి బయలుదేరుతారు.
★ మ.1.00కి అనంతపురానికి చేరుకుంటారు.
★ మ.2-సా.4.30 వరకు ఇంద్రప్రస్థ మైదానంలో జరిగే ‘సూపర్6-సూపర్ హిట్’ సభలో పాల్గొని ప్రసంగం
★ సభ ముగిశాక పుట్టపర్తి విమానాశ్రయానికి వెళ్లి అక్కడి నుంచి మంగళగిరికి వెళ్తారు.
News September 10, 2025
ఆ రైలుకు బేతంచెర్లలో స్టాపింగ్

కరోనా సమయంలో రద్దైన స్టాపింగ్‌లను ప్రయాణికుల సౌకర్యార్థం 137 స్టేషన్లలో పునరుద్ధరించినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అందులో భాగంగా మచిలీపట్నం–యశ్వంత్‌పూర్ మధ్య నడిచే కొండవీడు రైలు (17211)కు ఈ నెల 10వ తేదీ నుంచి బేతంచర్ల స్టేషనులో రాత్రి 12:34 గంటలకు స్టాపింగ్ కల్పించారు. అదే విధంగా తిరుగు ప్రయాణం (17212)లో ఈ నెల 11వ తేదీ నుంచి బేతంచర్లలో రాత్రి 9:19 గంటలకు స్టాపింగ్ పునరుద్ధరించారు.