News April 8, 2025
MGUలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ!

మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 39 మంజూరు పోస్టులకు గాను 29మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇంకా 10ఖాళీలు ఉన్నాయి. అకడమిక్ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో ఎన్ని భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం వెల్లడించలేదు.
Similar News
News January 8, 2026
గద్వాల్: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్

కేటిదొడ్డి మండల కేంద్రములో రూ.200 కోట్లతో చేపట్టనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం స్థలాన్ని MLA బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పరిశీలించారు. MLA మాట్లాడుతూ.. ఈ స్కూల్ అందుబాటులోకి వస్తే నియోజకవర్గ విద్యార్థులకు సకల వసతులతో కూడిన నాణ్యమైన ఆంగ్ల విద్య అందుతుందన్నారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధన, హాస్టల్ సౌకర్యం ఒకే చోట లభిస్తాయన్నారు.
News January 8, 2026
మెదక్: అటవీ ప్రాంతంలో మహిళ అస్తిపంజరం లభ్యం

కౌడిపల్లి మండలం తునికి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో మహిళ అస్తిపంజరం స్థానికంగా కలకలం రేపింది. ఫారెస్ట్ భూమిలో మానవ అవశేషాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. మహిళ అస్థిపంజరంగా గుర్తించారు. హత్య చేశారా లేదా మరేదైనా కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల ఎవరైనా మహిళలు తప్పిపోయినట్లు తెలిస్తే సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
News January 8, 2026
భూపాలపల్లి: మహిళ హత్య కేసులో జీవిత ఖైదు

కాటారం మండలం విలాసాగర్‌లోని 2019లో జరిగిన హత్య కేసులో తీర్పు వచ్చింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో మహిళపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టి హత్య చేసిన కేసులో నిందితుడు రవికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.10,500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి రమేశ్ బాబు తీర్పునిచ్చారు. ఈ కేసులో ఆధారాలను సేకరించి శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ అధికారులను ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ప్రత్యేకంగా అభినందించారు.


