News October 21, 2025

MGUలో ఈ నెల 22న ప్లేస్మెంట్ డ్రైవ్: డా. వై ప్రశాంతి

image

MGUలో ఈ నెల 22న ప్లేస్మెంట్ డ్రైవ్ ఉదయం 9:30 గంటలకు సెమినార్ హాల్ ఆర్ట్స్ బ్లాక్ నందు ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ Dr.Y. ప్రశాంతి తెలిపారు. Franqulin Tech, హైదరాబాద్ సంస్థ వారి సహకారంతో నిర్వహించే ఈ కార్యక్రమంలో IT, Non-IT సంస్థలు పాల్గొంటాయి. ఈ ప్లేస్మెంట్ డ్రైవ్‌కి UG, PG, B.Tech విద్యార్థులు అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

Similar News

News October 21, 2025

ఢిల్లీలో దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత

image

దీపావళి వేళ దేశంలో చాలా ప్రాంతాలను వాయు కాలుష్యం కమ్మేసింది. ఢిల్లీలోని నరైనా గ్రామంలో నిన్న రాత్రి 11.39pmకు వాయు నాణ్యత సూచీ(AQI) 1991గా నమోదైంది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ట్వీట్ చేశారు. ‘హమారా ఢిల్లీ’ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. కాగా హైదరాబాద్‌లోనూ అర్ధరాత్రి AQI 150కిపైగా నమోదైంది. ఈ వాతావరణం అనారోగ్యానికి దారి తీస్తుందని వాతావరణ నిపుణులు తెలిపారు.

News October 21, 2025

తొలి వన్డేలో ఆ ప్లేయర్‌ను తీసుకోవాల్సింది: కైఫ్

image

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఆడించి ఉండాల్సిందని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డారు. తుది జట్టులో అన్నీ కవర్ చేసినా వికెట్ టేకింగ్ బౌలర్‌ను తీసుకోలేదని చెప్పారు. AUS దిగ్గజ బౌలర్ షేన్ వార్న్ అన్ని ఫార్మాట్లలో రాణించారని గుర్తు చేశారు. తొలి వన్డేలో ఆసీస్ స్పిన్నర్ మాథ్యూ కునెమన్ 2 వికెట్లు తీశారని తెలిపారు. క్వాంటిటీ కోసం క్వాలిటీ విషయం రాజీ పడ్డారన్నారు.

News October 21, 2025

జనగామ: పంట కల్లాలకు మోక్షం ఎప్పుడో!

image

ధాన్యం దిగుబడి వచ్చిన రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టేందుకు కల్లాలు లేక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పొలాలు, రహదారులపై ఆరబోసుకుంటున్నారు. జిల్లాలో రెండు లక్షలకు పైగా రైతులంటే కేవలం 4 వేల పంట కల్లాలు ఉండటం గమనార్హం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పంట కల్లాల నిర్మాణం చేపట్టాలని జిల్లాల్లోని రైతులు కోరుతున్నారు.