News March 20, 2025
MGUలో అభివృద్ధి పనులు సాగేదెలా..?

MG యూనివర్సిటీకి ప్రగతి పద్దు కింద ఎలాంటి నిధులివ్వకపోవడంతో యూనివర్శిటీలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులు ప్రశ్నార్థకంగా మారేలా ఉన్నాయి. వివిధ పనులను చేపట్టేందుకు, కొత్త కోర్సులను ప్రవేశ పెట్టేందుకు, ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు, భవనాల నిర్మాణం, మౌలికసదుపాయాల కల్పన తదితర పనులకు రూ.309 కోట్లు కావాలని యూనివర్సిటీ ప్రతిపాదించినా పైసా కేటాయించకపోవడం పట్ల విద్యావేత్తలు మండిపడుతున్నారు.
Similar News
News March 21, 2025
NLG: యువ వికాసానికి ఆదిలోనే చిక్కులు..!

యువ వికాసం పథకానికి ఆదిలోనే చిక్కులు ఎదురవుతున్నాయి. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారికి కచ్చితంగా రేషన్ కార్డు ఉండాల్సిందేనన్న నిబంధన పెట్టడంతో జిల్లాలో నిరుద్యోగులకు శాపంగా మారింది. రేషన్ కార్డు నిబంధనలతో ఆశావహులంతా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధనను వెంటనే తొలగించాలని వివిధ పార్టీల నేతలు, నిరుద్యోగులు నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తం అవుతోంది.
News March 21, 2025
లాంగెస్ట్ రోడ్ నెట్‌వర్క్‌లో నల్గొండ స్థానం ఇది..!

రాష్ట్రంలో అత్యధిక దూరం రోడ్ నెట్‌వర్క్ కలిగిన జిల్లాల్లో నల్గొండ రెండో స్థానంలో నిలిచింది. ప్రథమ స్థానంలో రంగారెడ్డి జిల్లా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,11,775.56 కిలోమీటర్ల రోడ్ కనెక్టవిటీ ఉండగా.. రంగారెడ్డిలో 7,932.14 కిలోమీటర్ల రోడ్ నెట్‌వర్క్ ఉంది. నల్గొండలో 7,766.92 కిలోమీటర్లు రోడ్డు కనెక్టవిటీ ఉంది. కాగా, కీలకమైన రోడ్డు డెవలప్‌మెంట్ ప్రాజెక్టుల్లో నల్గొండను ఒకటిగా ఎంచుకున్నారు.
News March 21, 2025
నల్గొండ ఫస్ట్.. సూర్యాపేటకు ఫోర్త్ ప్లేస్..!

రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ లేని విధంగా నల్గొండలోనే అత్యధిక వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. 2,37,664 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లతో NLG మొదటి స్థానంలో ఉండగా.. 1,54,224 కనెక్షన్లతో సూర్యాపేట నాల్గో స్థానంలో ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,17,477 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. అన్ని కేటగిరీల విద్యుత్ కనెక్షన్ల పరంగా చూస్తే.. నల్గొండ ఐదో స్థానంలో నిలిచింది.