News October 20, 2024
MH: MLA అభ్యర్థుల జాబితా విడుదల చేసిన BJP

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేేసే అభ్యర్థుల జాబితాను BJP విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలుండగా 99 మందితో ఫస్ట్ లిస్టును రిలీజ్ చేసింది. ఆ పార్టీ నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ నుంచి బరిలో నిలిచారు. కాగా నవంబర్ 20న పోలింగ్ జరగాల్సి ఉంది.
Similar News
News November 13, 2025
ఈరోజు తీవ్ర చలి.. జాగ్రత్త!

TG: రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు రాత్రి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ నెలలో ఇదే కోల్డెస్ట్ నైట్ కానుందని అంచనా వేశారు. రేపు ఉదయానికల్లా ఉష్ణోగ్రతలు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో 10-11°Cకి, నార్త్, వెస్ట్ తెలంగాణలో 7-10°Cకి తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. వీలైనంత వరకు ప్రజలు బయటకు వెళ్లొద్దని, అత్యవసరం అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News November 13, 2025
ఢిల్లీ పేలుడు: ఈ లేడీ డాక్టర్‌తో ఆ కిలేడీకి సంబంధాలు!

ఢిల్లీ పేలుడు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టైన Dr షహీన్‌కు పుల్వామా మాస్టర్‌మైండ్ ఉమర్ ఫరూఖ్ భార్య అఫీరాతో సంబంధాలున్నట్లు అధికారులు గుర్తించారు. అఫీరా, మసూద్ అజార్ చెల్లెలు సాదియా కలిసి షహీన్‌ను సంప్రదించినట్లు దర్యాప్తు వర్గాలు చెప్పాయి. భారత్‌లో జైషే మహిళా వింగ్ ఏర్పాటు చేసి మహిళలను రిక్రూట్ చేయాలని చెప్పినట్లు తెలిపాయి. 2019లో ఎన్కౌంటర్లో ఉమర్ హతమయ్యాడు.
News November 13, 2025
రేపే ఫలితాలు.. Way2Newsలో వేగంగా..

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. దాంతో పాటు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రిజల్ట్ రాబోతోంది. మీరెంతో అభిమానించే Way2News ఉ.8 గంటల నుంచే కౌంటింగ్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీ ముందు ఉంచుతుంది. వేగంతో పాటు స్పెషల్ గ్రాఫిక్ ప్లేట్లతో ఫలితాల వివరాలను వెల్లడిస్తుంది.


