News October 23, 2024

MH ఎన్నికలు.. 85 సీట్ల చొప్పున పోటీ

image

మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ కూటమి సీట్ల పంపకంపై క్లారిటీ వచ్చింది. 85 సీట్ల చొప్పున పోటీ చేయాలని కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్ థాక్రే), ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీలు నిర్ణయించాయి. మిగతా 18 సీట్లపై కూటమిలోని మిగతా పార్టీలతో చర్చించి రేపు నిర్ణయం తీసుకుంటామని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే తెలిపారు. ఈసారి తాము కచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News October 23, 2024

AQI స్కోర్: ఇండియాను బీట్ చేసిన పాక్

image

దాయాది పాకిస్థాన్ బ్యాడ్ రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరమున్న దేశంగా అవతరించింది. AQI 394తో లాహోర్ మన ఢిల్లీని బీట్ చేసింది. సాధారణంగా Air Quality Index 100 ఉంటేనే ఆరోగ్యానికి మంచిదికాదు. ఇక 150 అయితే భయంకర రోగాలు అటాక్ చేస్తాయి. అలాంటిది 394 అంటే ఎంత డేంజరో అర్థం చేసుకోవచ్చు. ఇక ఢిల్లీ, కిన్షాసా, ముంబై, మిలనో, ఉలన్ బాటర్, కరాచీ సిటీస్ లాహోర్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

News October 23, 2024

ఇండియా వెనక్కి తగ్గదు, ఓటమిని ఒప్పుకోదు: బ్రెట్‌ లీ

image

క్రికెట్‌లో టీమ్ ఇండియా శక్తిమంతమైనదని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్‌ లీ అభిప్రాయపడ్డారు. ఓటమి ఒప్పుకొని వెనక్కి తగ్గే అలవాటు ఆ జట్టుకు లేదన్నారు. ‘భారత్ ఒకప్పటి లాంటి జట్టు కాదు. ఎప్పుడైనా, ఎలాంటి జట్టునైనా మట్టి కరిపించగలమని భారత్‌కు తెలుసు. AUSను ఓడించగలమని కూడా తెలుసు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో నిర్లక్ష్యంగా ఆడటం వల్ల ఓడింది. రెండో టెస్టులో కచ్చితంగా పుంజుకుంటుంది’ అని స్పష్టం చేశారు.

News October 23, 2024

గ్రూప్ 1 మెయిన్స్: మూడో రోజు హాజరు 68.2%

image

TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య రోజురోజుకి తగ్గుతోంది. ఇవాళ (మూడో రోజు) జరిగిన పేపర్-2 హిస్టరీ కల్చర్ అండ్ జియోగ్రఫీ పరీక్షను 68.2% మంది అభ్యర్థులు రాశారు. మొత్తం 31,383 మంది అభ్యర్థుల్లో 21,429 మంది మాత్రమే హాజరయ్యారు. తొలి రోజు 72.4%, రెండో రోజు 69.4% హాజరు నమోదైంది. ఈ పరీక్షలు ఈనెల 27 వరకు కొనసాగనున్నాయి.