News October 15, 2025
MHBD:ఈ కుర్చీకి అధికారం దక్కేది ఎప్పుడో..!

మహబూబాబాద్ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పదవి ఎవరికీ దక్కేది ఎప్పుడని స్థానిక అధికార పార్టీ నాయకులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు గ్రంథాలయానికి ఛైర్మన్‌ను నియమించలేదు. గ్రంథాలయానికి ఛైర్మన్ పాలకమండలి లేకపోవడంతో గ్రంథాలయం సమస్యలను పట్టించుకునే నాథుడే కరవయ్యారని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఛైర్మన్‌ను నియమించలేదు.
Similar News
News October 15, 2025
గూగుల్ రాకపై చిత్తూరు MP ఏమన్నారంటే..?

విశాఖలో గూగుల్ ఏర్పాటుతో డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఊతమస్తుందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్ రావు అన్నారు. నూతన ఆవిష్కరణలో సీఎం చంద్రబాబు ముందుంటారని కొనియాడారు. వికసిత భారత్‌లో ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేస్తోందన్నారు. ఏపీ, గూగుల్ మధ్య ఒప్పందం చారిత్రాత్మకమని చెప్పారు. ఈ ఒప్పందంతో విశాఖపట్నం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిందన్నారు.
News October 15, 2025
వనపర్తి జిల్లా యువతకు ఎస్పీ సూచనలు

బైక్ పై ముగ్గురు ప్రయాణించడం చట్టవిరుద్ధం, అత్యంత ప్రమాదకరమని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. ట్రిపుల్ రైడింగ్ వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. చిన్నతప్పిదం ప్రాణాంతక ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉంటుందన్నారు. యువతలు, విద్యార్థులు నిర్లక్ష్యంగా ఇలా ప్రయాణించడం మానుకోవాలని సూచించారు. వాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News October 15, 2025
బిహార్‌లో పురుష ఓటర్లదే ఆధిక్యం.. కానీ!

బిహార్‌లో పురుష ఓటర్లే అధికంగా ఉన్నారు. మొత్తం 3.92 కోట్ల పురుష ఓటర్లు ఉండగా స్త్రీ ఓటర్లు 3.5 కోట్లు ఉన్నారు. ప్రతి 1000 మంది పురుషులకు 892 మంది స్త్రీ ఓటర్ల నిష్పత్తి నమోదైంది. గత ఎన్నికల్లో (899) కన్నా ఇది తగ్గింది. స్త్రీలు తమ భర్తలు ఫారాలు తెచ్చినప్పుడే మాత్రమే ఓటర్లుగా నమోదవుతున్నారు. అయితే ఓటింగ్‌లో మాత్రం చురుగ్గా పాల్గొంటూ ఎన్నికల ఫలితాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారని NDA పేర్కొంది.