News February 2, 2025
MHBD: అంగన్వాడీ ఆయాలకు శుభవార్త
టెన్త్ పాస్ అయినా ఆయాలకు అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్ ఇవ్వనున్నట్లు మహబూబాబాద్ కాంగ్రెస్ అర్బన్ అధ్యక్షుడు గణపురపు అంజయ్య అన్నారు. 2022 ఆగస్టు 1కి ముందు ఆయాలుగా నియమితులైన వారికి ప్రమోషన్ కల్పించాలని CM రేవంత్ రెడ్డి తాజాగా నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో ఆయాలు ఆందోళనలు చేసినా కేసీఆర్ పట్టించుకోలేదని ఆయన అన్నారు.
Similar News
News February 2, 2025
BREAKING: చరిత్ర సృష్టించిన భారత్
ఇంగ్లండ్తో జరుగుతున్న 5వ T20లో భారత్ చరిత్ర సృష్టించింది. T20Iలో పవర్ప్లేలో అత్యధిక స్కోరు చేసింది. అభిషేక్ శర్మ(94*), తిలక్ వర్మ(24) విధ్వంసంతో 6 ఓవర్లలో భారత్ 95/1 రన్స్ చేసింది. ఇప్పటివరకు 2021లో స్కాట్లాండ్పై చేసిన 82/2 పవర్ప్లేలో భారత్కు అత్యధిక స్కోరు కాగా, ఆ రికార్డును తాజాగా బ్రేక్ చేసింది. ప్రస్తుతం స్కోరు 9 ఓవర్లలో 136-2గా ఉంది.
News February 2, 2025
ఆండ్ర ఎస్ఐపై విచారణకు ఆదేశం
ఆండ్ర ఎస్ఐ సీతారాములు తీరుపై విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ విచారణకు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కొంతమంది రాజకీయ నాయకులను ఆయన కలిసినట్లుగా వచ్చిన ఆరోపణలపై బొబ్బిలి డీఎస్పీ భవ్యరెడ్డిని విచారణ చేసి నివేదిక పంపాలని ఆదేశించామన్నారు. విచారణలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు తేలితే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఎస్పీ తెలిపారు.
News February 2, 2025
HYD: కేంద్రం మొండిచేయి చూపింది: మహేష్ గౌడ్
తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతుందని TPCC అధ్యక్షుడు మహేశ్ గౌడ్ అన్నారు. ఎన్నికల జరిగే రాష్ట్రాల్లోని కేంద్ర నిధులు ఇస్తుందని, అభివృద్ధి అంటే బీజేపీ ఇష్టంగా మారిందన్నారు. ఎన్నికల గెలవాలని ఉద్దేశంతోనే నిధులు ఇచ్చారని, మోదీకి అనేకసార్లు కలిసి విన్నవించినా కనికరించలేదన్నారు. రాష్ట్రానికి కేంద్రం మొండి చేయి చూపించిందని, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాలన్నారు.