News April 3, 2025

MHBD: అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్

image

రాజీవ్ యువవికాసం దరఖాస్తుదారులకు ఏ ఇబ్బందులూ లేకుండా అన్నిఏర్పాట్లు చేయాలని, వేసవిలో తాగునీటికి ఇబ్బంది లేకుండా సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్ఆర్ఆజీఎస్, పెన్షన్స్, యూనిఫామ్స్, సెర్ప్‌కు సంబంధించిన పనులు వేగవంతం చేయాలన్నారు.

Similar News

News February 23, 2026

మేం హిందుత్వ రాజకీయాలు చేయం: భాగవత్

image

RSS హిందుత్వ రాజకీయాలు చేయదని, కేవలం వ్యక్తి నిర్మాణంతో సమాజం, దేశాభివృద్ధిని మాత్రమే కోరుకుంటుందని సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. శక్తిమంతమైన వ్యక్తులే బలమైన సమాజాన్ని నిర్మించగలరని, అందుకే వ్యక్తి వికాసమే తమ లక్ష్యమని డెహ్రాడూన్‌లో జరిగిన శతాబ్ది ఉత్సవాల్లో మాట్లాడారు. సంఘ్ వాస్తవ రూపాన్ని బయటి నుంచి చూసి అర్థం చేసుకోలేమని, ఆ లోతును గ్రహించాలంటే లోపల ఉండి చూడాలని ఆయన వ్యాఖ్యానించారు.

News February 23, 2026

PDPL: లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత మల్ల రాజిరెడ్డి

image

PDPL(D) మంథని(M) శాస్త్రులపల్లికి చెందిన మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్ల రాజిరెడ్డి అలియాస్ సత్తన్న నిన్న పోలీసుల ఎదుట లొంగిపోయారు. 1975లో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన, ఆపరేషన్ కగార్ పేరిట వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్ల, అనారోగ్యం, పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారడంతో పోలీసులకు సరెండర్ అయ్యారు. 2007 కేరళ జిల్లాలో SIB పోలీసులు అరెస్ట్ చేయగా, 2009లో బెయిల్‌పై విడుదలై మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారు.

News February 23, 2026

80 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

UPSC ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌ ఎగ్జామినేషన్-2026కు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఈ నోటిఫికేషన్ ద్వారా 80 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ(BZC, ఫిజిక్స్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, జియోలజీ, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, Engg., ఎనిమల్ హజ్బెండరీ& వెటర్నరీ సైన్స్) ఉత్తీర్ణులు అర్హులు. వయసు 21- 32ఏళ్ల మధ్య ఉండాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.upsc.gov.in