News February 11, 2025
MHBD: అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే కఠినచర్యలు : SP

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామానాథ్ కేకన్ ఆకేరు నది పరివాహక ప్రాంతాలను మంగళవారం పరిశీలించారు. ఇసుకను అక్రమరవాణా చేస్తున్నారని చాలా ఫిర్యాదులు వస్తున్నాయని క్షేత్రస్థాయిలో పర్యటించామన్నారు. ఇక నుంచి అనుమతులు లేకుండా ఎవరు కూడా ఇసుకను తరలించకూడదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News November 21, 2025
బాపట్ల: ‘మత్స్యకారులు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక’

మత్స్యకారులు, ఆక్వా ఫార్మర్లు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక అని బాపట్ల జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్ అన్నారు. నిజాంపట్నం సైక్లోన్ భవన్ వద్ద శుక్రవారం జరిగిన ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం వేడుకల్లో డీఆర్ఓ పాల్గొన్నారు. గంగపుత్రుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు ప్రసాద్ అన్నారు.రాష్ట్ర అగ్నికుల క్షత్రియ ఛైర్మన్ పాపారావు పాల్గొన్నారు.
News November 21, 2025
బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణకు నిధి, శ్రీముఖి

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సీఐడీ విచారణకు హాజరయ్యారు. యాప్స్ ప్రమోషన్స్, డబ్బుల లావాదేవీలపై అధికారులు వారిని ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే రానా, ప్రకాశ్ రాజ్ తదితరులను సీఐడీ విచారించింది.