News February 11, 2025

MHBD: అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే కఠినచర్యలు : SP

image

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామానాథ్ కేకన్ ఆకేరు నది పరివాహక ప్రాంతాలను మంగళవారం పరిశీలించారు. ఇసుకను అక్రమరవాణా చేస్తున్నారని చాలా ఫిర్యాదులు వస్తున్నాయని క్షేత్రస్థాయిలో పర్యటించామన్నారు. ఇక నుంచి అనుమతులు లేకుండా ఎవరు కూడా ఇసుకను తరలించకూడదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News March 25, 2025

గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులు: బొత్స

image

AP: చంద్రబాబు పాలనలో ప్రకృతి కూడా రైతులకు అనుకూలంగా ఉండదని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేక అన్నదాతలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క కేజీ అయినా కొనుగోలు చేసిందా? అని ప్రశ్నించారు. ధర లేక చెరుకు పంటను రైతులే కాల్చుకునే పరిస్థితి ఉందన్నారు.

News March 25, 2025

మెదక్ పట్టణంలో ATM వద్ద మోసాలు.. జాగ్రత్త

image

మెదక్‌లో ఓ బ్యాంక్ ATM వద్ద ఇద్దరు వ్యక్తులు డబ్బులు డ్రా చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ATM వద్ద నిలబడి ఎవరికైతే డబ్బులు డ్రా చేయడం రాదో వారినే టార్గెట్ చేస్తూ డబ్బులు తీసి ఇస్తానని చెప్పి కార్డును మార్చేస్తున్నారు. తన దగ్గర ఉన్న మరో కార్డును వారికిచ్చి అక్కడ నుంచి వెళ్లి వేరే ప్రాంతాల్లో డబ్బులు డ్రా చేస్తున్నట్లు టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. ఈ కొత్త తరహా మోసాలతో జాగ్రత్తంగా ఉండాలన్నారు.

News March 25, 2025

MTM: ఎస్సీల సంక్షేమానికి రూ.341 కోట్ల బడ్జెట్ : శ్రీదేవి

image

రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల సంక్షేమం కోసం ఎస్సీ సబ్ ప్లాన్ కింద రూ.341 కోట్ల బడ్జెట్ కేటాయించిందని, వచ్చే ఏప్రిల్ మొదటి వారంలో వివిధ పథకాలు ప్రకటించనున్నట్లు రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్‌పర్సన్ ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. మంగళవారం మచిలీపట్నం వచ్చిన ఆమె ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించారు. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జగ్జీవన్ రామ్ చిత్రపటాలకు నివాళులర్పించి మాట్లాడారు.

error: Content is protected !!