News March 21, 2025
MHBD: ఆర్టీసీ కార్గో సేవలను ప్రజలు వినియోగించుకోవాలి: డిపో మేనేజర్

ఆర్టీసీ కార్గో అందిస్తున్న సేవలను ప్రజలు వినియోగించుకోవాలని డిపో మేనేజర్ శివప్రసాద్ అన్నారు. భద్రాచలంలో ఏప్రిల్ 6న శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతుండగా కళ్యాణానికి వెళ్లలేని భక్తుల కొరకు స్వామివారి కల్యాణ తలంబ్రాలు టీజీఎస్ఆర్టీసీ కార్గో ద్వారా బుక్ చేసుకుని పొందవచ్చని, డిపో మేనేజర్ శ్రీ ఎం శివ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. రూ.151 వెచ్చించి, బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు.
Similar News
News February 27, 2026
మార్చి 1 నుంచి పెరగనున్న ఫోన్ ధరలు

వివో, iQOOలోని పలు మోడల్స్ ధరలు MAR 1 నుంచి పెరగనున్నట్లు తెలుస్తోంది. Vivo T4 బేస్ వేరియంట్ ₹22,999 ఉండగా ₹26,999కు పెరగనుంది. మిడ్, టాప్ వేరియంట్లూ ₹2వేలు పెరగనున్నాయి. Vivo T4R వేరియంట్లపై చెరో ₹2వేలు, T4Xకు ₹1500 పెరగనుంది. iQOO Z10, iQOO Z10R మోడళ్లు ₹2వేలు పెరగనున్నాయి. ఇక iQOO Z10x బేస్ వేరియంట్‌పై ₹1500, మిడ్, టాప్ వేరియంట్లు ₹2500 పెరగనున్నాయి. ఇప్పటికే శాంసంగ్ కూడా ధరలు పెంచింది.
News February 27, 2026
తిరుపతి: B.Ed ఫలితాలు విడుదల

తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గతేడాది డిసెంబర్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (B.Ed) మూడో(3వ) సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఫలితాలను https://www.manabadi.co.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోగలరు.
News February 27, 2026
TU: ఎల్ఎల్‌బీ 5వ సెమిస్టర్ పరీక్షలు.. ఒకరు గైర్హాజరు

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఎల్ఎల్‌బీ ఐదో సెమిస్టర్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా కొనసాగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 28 మంది విద్యార్థులకు 27 మంది హాజరుకాగా ఒక్కరు గైర్హాజరైనట్లు వెల్లడించారు. విద్యార్థులు ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడలేదని తెలిపారు.


