News January 30, 2025
MHBD: ఇంటర్మీడియట్ పరీక్షలపై కలెక్టర్ అధికారులతో సమీక్ష

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై అధికారులతో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు జరిగే ప్రాక్టికల్ పరీక్షలు, మార్చి 5 నుంచి 25 వరకు జరిగే థియరీ పరీక్షలు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. జిల్లాలో ప్రాక్టికల్ పరీక్షలు 40 కేంద్రాలు, థియరీ పరీక్షలు 20 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు
Similar News
News October 22, 2025
రెవెన్యూ సేవలు సకాలంలో అందించాలి: కలెక్టర్

రెవెన్యూ సేవల విషయంలో భూ సమస్యలను త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం నంద్యాల పట్టణం ఎన్జీవోస్ కాలనీలోని 18వ సచివాలయంలో రెవెన్యూ సంబంధిత సేవలలో ఆలస్యాలు, ప్రజల్లో అసంతృప్తికి దారితీస్తున్న నేపథ్యంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. జనవరి నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రజల నుంచి అందిన 332 దరఖాస్తులను కలెక్టర్ పరిశీలించారు.
News October 22, 2025
కొత్తకోట: రెండు వాహనాలు ఢీ.. 8 మందికి గాయాలు

కొత్తకోట మండలం నాటవెల్లి-ముమ్మాలపల్లి గ్రామాల మధ్య NH- 44 పై బొలెరో, తుఫాన్ ఢీకొన్న ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాదు నుంచి పెబ్బేరు వైపు ప్రయాణికులతో వెళుతున్న తుఫాన్, కర్నూల్ నుంచి హైదరాబాద్ వెళుతున్న బొలెరోను ఢీకొంది. క్షతగాత్రుల్ని వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
News October 22, 2025
రాణీ అహల్యాబాయి.. అందరికీ ఆదర్శం

మాల్వాను పాలించిన రాణీ అహల్యాబాయి హోల్కర్ ఆదర్శ పాలకుల్లో ఒకరు. 1754లో జరిగిన కుంభేర్ యుద్ధంలో భర్త ఖండేరావు, 1767లో కుమారుడు మలేరావు మరణించడంతో 1795 వరకు ఇండోర్‌ను పాలించారు. అహల్యాబాయి పాలనాకాలం మరాఠా సామ్రాజ్యపు స్వర్ణయుగంగా గుర్తింపు పొందింది. ఎన్నో ప్రసిద్ధ హిందూ దేవాలయాలను ఆమె పునరుద్ధరించారు. అహల్యాబాయి కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం ఈమె పేరిట స్త్రీ శక్తి పురస్కారాన్ని నెలకొల్పింది.


