News February 21, 2025
MHBD: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు వెబ్సైట్!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వెబ్ సైట్ తీసుకువచ్చింది. మహబూబాబాద్ జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు ఇల్లు కోసం దరఖాస్తు చేసుకోగా.. లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారు. ప్రస్తుతం దరఖాస్తు ఏ స్థితిలో ఉందో తెలియక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే వారంతా https:indirammaindlu.telangana.gov.inలో ఆధార్, ఫోన్ నంబర్ ద్వారా దరఖాస్తు వివరాలు తెలుసుకోవచ్చు. Share It.
Similar News
News December 7, 2025
నాగర్కర్నూల్లో స్వల్పంగా తగ్గిన చలి

నాగర్కర్నూల్ జిల్లాలో నిన్నటితో పోలిస్తే చలి తీవ్రత స్వల్పంగా తగ్గింది. గత 24 గంటల్లో జిల్లాలో అత్యల్పంగా చారకొండ మండలంలో 15.2 సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అమ్రాబాద్లో 15.5, కల్వకుర్తి, అచ్చంపేట, పదర మండలాల్లో 15.9 చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
News December 7, 2025
ఖమ్మం: ‘పంచాయతీ’ పోరు ఉద్ధృతం!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 1042 పంచాయతీల్లో మూడు విడతల (డిసెంబర్ 11, 14, 17) ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. గుర్తులు కేటాయించిన తొలి, రెండో విడత అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. రాత్రి వేళల్లో ఆర్థిక హామీలతో మంతనాలు జోరందుకున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, తమ ఎమ్మెల్యేలు, కీలక నేతలను రంగంలోకి దించడంతో పల్లెపోరు మరింత వేడెక్కింది.
News December 7, 2025
విద్యార్థి ఇంటి ముందు ఉపాధ్యాయుల ధర్నా

TG: విద్యార్థి స్కూలుకు రాలేదని టీచర్లు ధర్నా చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. దుమ్ముగూడెం మండలం నిమ్మలగూడెంలో నాలుగో తరగతి స్టూడెంట్ వారం నుంచి స్కూలుకు రావట్లేదు. పేరెంట్స్ని అడిగితే సమాధానం లేదు. దాంతో ఆ ప్రాథమిక పాఠశాల టీచర్లు మిగిలిన విద్యార్థులతో కలిసి ఆ పిల్లాడి ఇంటి ముందు బైఠాయించారు. సోమవారం నుంచి పిల్లాడిని బడికి పంపుతామని పేరెంట్స్ హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.


