News March 11, 2025
MHBD: ఈనెల 14 నుంచి వ్యవసాయ మార్కెట్ బంద్

మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్కు ఈనెల 14 నుంచి 16 వరకు సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్ సుధాకర్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. మార్కెట్లో మిర్చి పంట పోటెత్తినట్లు తెలిపారు. సుమారు 20 వేల బస్తాలు మార్కెట్లో ఉన్నాయని, రైతులు మిర్చి పంటను విక్రయానికి తీసుకురావొద్దని సూచించారు. ఈనెల 17 నుంచి మార్కెట్లో కొనుగోలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
Similar News
News December 4, 2025
వైసీపీ వల్లే రాజధాని నిర్మాణం ఆలస్యం: నారాయణ

AP: వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో రాజధాని అమరావతి నిర్మాణం ఆలస్యమైందని మంత్రి నారాయణ విమర్శించారు. బకాయిలు చెల్లించి పనులు ప్రారంభించే నాటికి వర్షాలు ముంచెత్తాయని చెప్పారు. పల్నాడు జిల్లా అమరావతి మండలం యండ్రాయిలో రెండో విడత భూసమీకరణపై గ్రామస్థులతో సమావేశమయ్యారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తామని పేర్కొన్నారు.
News December 4, 2025
పల్నాడు కోనసీమ మంచికల్లులో పోలేరమ్మ తిరుణాల వైభవం.!

పల్నాటి కోనసీమగా పిలవబడే రెంటచింతల మండలం మంచికల్లు గ్రామ దేవత పోలేరమ్మ తిరునాల మహోత్సవం కోర్ల పౌర్ణమి సందర్భంగా గురువారం రోజున పెద్ద ఎత్తున ప్రారంభమైంది. కొన్ని వందల సంవత్సరాలుగా డిసెంబర్లో వచ్చే పౌర్ణమి కొర్ల పౌర్ణమిగా పరిగణించి ఈ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. తిరుణాలలో మొదట శక్తిని నిలబెట్టి మరుసటి రోజు సాగనంపడం తరతరాల ఆనవాయితీగా వస్తుంది.
News December 4, 2025
ENCOUNTER: 19కి చేరిన మృతుల సంఖ్య

ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో జరిగిన <<18460138>>ఎన్కౌంటర్లో<<>> మృతుల సంఖ్య పెరిగింది. ఇప్పటివరకు 19 మంది మావోలు చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల్లో PLGA-2 కమాండర్ వెల్లా మోడియం కూడా ఉన్నారు. భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. మరోవైపు ఎదురుకాల్పుల్లో నిన్న ముగ్గురు పోలీసులు మరణించిన విషయం తెలిసిందే.


