News March 11, 2025

MHBD: ఈనెల 14 నుంచి వ్యవసాయ మార్కెట్ బంద్

image

మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు ఈనెల 14 నుంచి 16 వరకు సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్ సుధాకర్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. మార్కెట్లో మిర్చి పంట పోటెత్తినట్లు తెలిపారు. సుమారు 20 వేల బస్తాలు మార్కెట్లో ఉన్నాయని, రైతులు మిర్చి పంటను విక్రయానికి తీసుకురావొద్దని సూచించారు. ఈనెల 17 నుంచి మార్కెట్లో కొనుగోలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.

Similar News

News February 17, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 17, 2026

స్ కోచ్ చెన్నకేశవులకు కోనేరు హంపి ప్రశంసలు

image

విజయవాడలో నిర్వహించిన శాప్ లీగ్ మహోత్సవంలో భారత మహిళా గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి సందడి చేశారు. ఈ సందర్భంగా సీనియర్ నేషనల్ ఆర్బిటర్ అవార్డు గ్రహీత, చెవిటికల్లుకు చెందిన చెస్ కోచ్ గుజ్జర్లపూడి చెన్నకేశవులను ఆమె అభినందించారు. గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలని కోరారు. కఠిన సాధనతోనే చదరంగంలో ఛాంపియన్‌లుగా ఎదగగలరని హంపి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.

News February 17, 2026

KNR మేయర్ శ్రీనివాస్ రాజకీయ ప్రస్థానమిదే..!

image

<<19162897>>శ్రీనివాస్ <<>>2014- 19 వరకు BJP మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2020-25 వరకు KNR మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ కార్పొరేటర్‌గా కొనసాగారు. 2021లో కరోనా వ్యాక్సిన్ జిల్లా కన్వీనర్‌గా, 2023-24 వరకు KNR టౌన్ 1 కన్వీనర్‌గా, 2024లో NIFFA రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2025లో చొప్పదండి మండల సర్పంచ్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. తాజాగా KNR మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.