News January 10, 2026
MHBD: ఊరూ వెళ్తున్నారా.. జాగ్రత్తలు పాటించాలి: ఎస్పీ

సంక్రాంతి పండగ వేల ఊరు వెళ్లేటప్పుడు ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ శబరిష్ అన్నారు. కాలనీలలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, విలువైన వస్తువులను కారు డిక్కీలలో వదిలి వేయొద్దన్నారు. జిల్లాలో చోరీల నియంత్రణకు ప్రత్యేకమైన చర్యలు చేపట్టామని, రాత్రి వేళలో గస్తీని మరింతగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనబడితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.
Similar News
News January 21, 2026
కర్నూలు: ఎయిడెడ్ పోస్టుల భర్తీకి పరీక్షా షెడ్యూల్ విడుదల

కర్నూలు జిల్లాలోని ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి డీఈవో సుధాకర్ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. దుపాడులోని డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి విద్యాసంస్థల్లో ఈనెల 27 నుంచి 31 వరకు పరీక్షలు జరుగుతాయని ఆయన తెలిపారు. ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News January 21, 2026
అనంతపురం: జాక్ పాట్ కొట్టిన 13 మంది విద్యార్థులు

అనంతపురం జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో సత్తా చాటారు. L&T కంపెనీ నిర్వహించిన ఇంటర్వ్యూలలో 13 మంది విద్యార్థులు రూ.6.7 లక్షల వార్షిక వేతనానికి ఎంపికయ్యారు. వీరిలో మెకానికల్ నుంచి ఎనిమిది, ఈఈఈ నుంచి ముగ్గురు, సివిల్ నుంచి ఇద్దరు ఉన్నారు. ప్రతిభ చాటిన విద్యార్థులను వీసీ సుదర్శన రావు, రిజిస్ట్రార్ కృష్ణయ్య, ప్రిన్సిపాల్ చెన్నారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
News January 21, 2026
మేడారం జాతరకు 244 ప్రత్యేక బస్సులు:ఆర్ఎం సరీరామ్

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తుల సౌకర్యార్థం ఖమ్మం రీజియన్ నుంచి 244 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్‌ఎం సరీరామ్ తెలిపారు. ఖమ్మం నుంచి 10, ఇల్లందు 41, సత్తుపల్లి 17, చర్ల 3, వెంకటాపూర్ 6, భద్రాచలం 21, పాల్వంచ 15, కొత్తగూడెం 110, మణుగురూ 16, మంగపేట 5 సర్వీసులు ఏర్పాటు చేశామన్నారు. ఈ బస్సులన్నీ మేడారంలోని గద్దెల సమీపానికే వెళ్తాయని పేర్కొన్నారు.


