News January 29, 2025

MHBD: ఏఆర్ కానిస్టేబుల్‌‌కు గోల్డ్ మెడల్

image

MHBD జిల్లా పోలీస్ శాఖలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న లింగన్న కరీంనగర్‌లో జరుగుతున్న మూడో రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌లో 10 కి.మీ పరుగు పందెంలో గోల్డ్ మెడల్‌ సాధించారు. కేవలం 34 నిమిషాల్లోనే పరుగును పూర్తి చేసి పతకాన్ని సాధించారు. కానిస్టేబుల్ లింగన్నను ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అభినందించారు.

Similar News

News December 7, 2025

నల్గొండ: యాసంగికి నీటి విడుదల ఇలా..

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాసంగి సీజన్‌కు ఆన్, ఆఫ్ పద్ధతిలో సాగు నీరు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 80.74 టీఎంసీల విడుదల చేయనుండగా నల్గొండ చీఫ్ ఇంజినీర్ పరిధిలో 43.74 టీఎంసీలు, సూర్యాపేట ఇంజినీర్ పరిధిలో 40 టీఎంసీల అవసరం ఉంటుందని నిర్ధారించారు. 15 రోజులకోసారి ఆన్, ఆఫ్ పద్ధతిలో నీటి విడుదల చేయనున్నారు. NLGలో 4,41,118, SRPTలో 4,74,041 ఎకరాలకు నీరు ఇవ్వనున్నారు.

News December 7, 2025

WGL: పంచాయతీ ఎన్నికలు ఎమ్మెల్యేలకు పరీక్షే!

image

పంచాయతీ ఎన్నికలు MLAలకు పెద్ద పరీక్షలా మారింది. సరిగ్గా రెండేళ్ల అనంతరం జరుగుతున్న ఎన్నికలు కావడంతో ప్రజల మనోగతం ఈ ఎన్నికల ద్వారా వెల్లడి కానుంది. ఉమ్మడి జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో 10 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్ పార్టీ MLAలు గెలుపొందారు. ప్రస్తుతం కాంగ్రెస్ 11, ఒక్క స్థానంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్నారు. పంచాయతీలను క్లీన్ స్వీప్ చేసి తమ సత్తా చాటుకొవాలని ఎమ్మెల్యేలందరూ గ్రామాల్లో తిరుగుతున్నారు.

News December 7, 2025

55 మంది పారిశ్రామికవేత్తలకు అవార్డులు అందజేసిన మంత్రి కొండపల్లి

image

రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడి కార్పొరేషన్ మండలి (COSIDICI) ఆధ్వర్యంలో శనివారం విశాఖలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 55 మంది పారిశ్రామికవేత్తలకు అవార్డులు అందజేశారు. ఇందులో రాష్ట్ర ఆర్థిక సంస్థ ద్వారా రుణాలు పొందిన 16 మంది పారిశ్రామికవేత్తలకు జాతీయ గౌరవ పురస్కారాలు లభించాయని మంత్రి తెలిపారు.