News January 29, 2025
MHBD: ఏఆర్ కానిస్టేబుల్‌కు గోల్డ్ మెడల్

MHBD జిల్లా పోలీస్ శాఖలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న లింగన్న కరీంనగర్‌లో జరుగుతున్న మూడో రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌లో 10 కి.మీ పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించారు. కేవలం 34 నిమిషాల్లోనే పరుగును పూర్తి చేసి పతకాన్ని సాధించారు. కానిస్టేబుల్ లింగన్నను ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అభినందించారు.
Similar News
News February 18, 2025
గుండెపోటుతో దేవనకొండ హెచ్ఎం మృతి

దేవనకొండ మండల కేంద్రంలోని ఎంపీపీ స్కూల్లో (మెయిన్) విధులు నిర్వహిస్తున్న హెచ్ఎం పద్మావతి సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. దేవనకొండలో బుధవారం ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు ఆమె భర్త రఘునాథ్ తెలిపారు. ఈ ఘటనతో దేవనకొండలో విషాదఛాయలు అమలుకున్నాయి. ఉపాధ్యాయులు శ్రద్ధాంజలి ఘటించారు.
News February 18, 2025
గుడివాడ: కొడాలి నాని ఆసక్తికర్ వ్యాఖ్యలు

రెడ్ బుక్ గురించి తనకు తెలియదని, దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉండటం లేదన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘అధికారంలో ఉన్నప్పుడు యాక్టివ్‌గా ఉన్నాం. మా ఉద్యోగం పీకేశారు. ఇప్పుడు యాక్టివ్‌గా ఉండి ఏం చేయాలి’ అంటూ సెటైరికల్ ఆన్సర్ ఇచ్చారు. వంశీ అరెస్ట్ లాంటివి చిన్న చిన్న విషయాలని అన్నారు.
News February 18, 2025
కరీంనగర్: వ్యక్తిపై కొడవలితో దాడి.. తీవ్ర గాయాలు

హత్యాయత్నం చేసిన దాడిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మానకొండూరు మండలం ముంజంపల్లికి చెందిన బత్తిని సాగర్ పై అదే గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తి భూసంబంధిత విషయంలో కొడవలితో దాడి చేయగా సాగర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దాడికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.