News April 7, 2025
MHBD: ఏడేళ్ల చిన్నారిపై కిడ్నాప్కు యత్నం

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని పిచ్చిరాం తండాలో ఏడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చెయ్యడానికి యత్నించిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సోదరుడు, మరో బాలుడితో చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటోంది. ఈ క్రమంలో మాస్కులు ధరించిన ఇద్దరు దుండగులు వచ్చి చిన్నారిని బలవంతంగా బైకుపై ఎక్కించుకొని వెళ్లారు. చిన్నారి కేకలు వేయడంతో వదిలిపెట్టి పారిపోయారు.
Similar News
News November 15, 2025
HYDలో పెరుగుతున్న వాయు కాలుష్యం..!

HYDలో వాయుకాలుష్యం, గాలిలో ధూళి కణాల సాంద్రత వృద్ధి చెందుతోంది. పర్టిక్యులేట్ మ్యాటర్ 242ను సూచిస్తుంది. మంచు, చల్లని గాలిలో ధూళికణాలు 4 నుంచి 8 అడుగుల ఎత్తులో అధిక మోతాదులో ఉంటాయని, దీంతో శ్వాసకోశ రోగాలు ప్రబలే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నగరంలో మొత్తం 14 ప్రాంతాల్లో గాలినాణ్యతను కొలిచే యంత్రాలను PCB ఏర్పాటు చేసింది. కాగా, గాలినాణ్యత సూచి 100దాటితే ప్రమాదం ఉంటుందని PCB చెబుతోంది.
News November 15, 2025
సతీశ్ మృతి.. తండ్రిని కోల్పోయిన చిన్నారులు

పరకామణి కేసులో కీలకంగా వ్యవహరించిన <<18292672>>సతీశ్ హత్య<<>> రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇప్పటికే పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టగా అటు పార్టీలు సైతం విమర్శలు గుప్పించుకుంటున్నాయి. అయితే దేవుడి సొమ్ము చోరీని బయటపెట్టిన తన భర్త ఆదేవుడి దగ్గరికే వెళ్లిపోయాడంటూ ఆకుటుంబం ఆవేదన వ్యక్తంచేసింది. సతీశ్కు భార్య మమత, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. సతీశ్ మృతితో ఒక్కసారిగా ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది.
News November 15, 2025
కాకరలో బూడిద తెగులు.. నివారణకు సూచనలు

వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు కాకర పంటలో బూడిద తెగులు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. పంటకు ఈ తెగులు సోకితే ఆకులపై బూడిద వంటి పొర ఏర్పడి ఆకులు ఎండిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి డైనోకాప్ 2 మి.లీ (లేదా) మైక్లోబ్యుటానిల్ 0.4 గ్రాములను కలిపి 7 నుంచి 10 రోజుల్లో 2, 3 సార్లు పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


