News April 3, 2025
MHBD: ఓపెన్ పరీక్షలపై అదనపు కలెక్టర్ సమీక్ష

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ వీర బ్రహ్మచారి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. పట్టణంలో ఓపెన్ ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల్లో విద్యుత్, మంచినీటి సౌకర్యం విద్యార్థులకు అందుబాటులో ఉంచి ఆర్టీసీ బస్సుల ఏర్పాట్లను అధికారులు సమన్వయంతో చేపట్టాలన్నారు.
Similar News
News November 28, 2025
అనకాపల్లి: ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు పెంపు

యుపీఎస్సీ సివిల్స్కు సంబంధించి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూకు సిద్ధం అయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువును డిసెంబర్ 3వ తేదీ వరకు పొడిగించారు. ఈ విషయాన్ని అనకాపల్లి జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారిణి కే.శ్రీదేవి తెలిపారు. అభ్యర్థులు తమ వివరాలతో పాటు 2 ఫొటోలు, విద్య, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్, పాన్ కార్డ్ జత చేయాలన్నారు.
News November 28, 2025
ఖమ్మం: వరి కొయ్యలను కాల్చొద్దు.. కలియ దున్నాలి

ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు వరి కొయ్యలను తగులబెట్టడం మానుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. వ్యర్థాలను కాల్చడం వల్ల పర్యావరణ కాలుష్యం పెరిగి, పంట దిగుబడిపై ప్రభావం పడుతుందని వారు తెలిపారు. దానికి బదులుగా, వ్యర్థాలను పొలంలోనే కలియదున్నడం వంటి పద్ధతులను అనుసరించాలని కోరారు. దీని వల్ల మట్టిలో పోషకాలు పెరిగి, భూసారం మెరుగుపడుతుందని అధికారులు రైతులకు వివరించారు.
News November 28, 2025
RECORD: ఎకరం రూ.151.25 కోట్లు

HYD: కోకాపేట-నియోపొలిస్ లేఅవుట్లో HMDA నిర్వహించిన భూముల వేలం మరోసారి రికార్డులు సృష్టించింది. ప్లాట్ నంబర్ 15లో ఎకరం రూ.151.25 కోట్లకు GHR సంస్థ దక్కించుకుంది. ప్లాట్ నంబర్ 16లో ఎకరం రూ.147.75 కోట్లకు గోద్రేజ్ సంస్థ సొంతం చేసుకుంది. మొత్తం 9.06 ఎకరాలకు వేలం వేయగా ప్రభుత్వానికి రూ.1353 కోట్ల భారీ ఆదాయం లభించింది. గత వారం ఇదే లేఅవుట్లో ఎకరం <<18376950>>రూ.137.25 కోట్లు<<>> పలికింది.


