News January 31, 2025
MHBD: కూతురి పెళ్లి కోసం దాచుకున్న నగదు చోరీ

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోద్గులగూడెం శివారు బేగావతు తండాలో భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన వీరన్న ఇంట్లో కూతురి పెళ్లి కోసం దాచుకున్న రూ.9 లక్షల నగదు దోచుకుపోయారని బాధితులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న సీరోలు ఎస్సై సీహెచ్ నగేశ్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
Similar News
News November 19, 2025
పద్మనాభంలో స్వామి ఉత్సవం ఎలా ప్రారంభమైంది?

పద్మనాభంలోని గిరి ప్రాంతంలో 1938లో విజయనగరం పాలకుడు పూసపాటి అలక్ నారాయణ గజపతి ఆనతి మేరకు ద్రాక్షారామం నుంచి వచ్చిన చేకూరి, బుల్లి సత్యనారాయణరాజు ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు. త్రిపుర సుందరీదేవి విగ్రహాన్ని తీసుకువచ్చి యజ్ఞాలు నిర్వహించేవారు. ఆఖరిరోజు అనంతుని కొండ మెట్ల పంక్తికి దీపోత్సవాన్ని నిర్వహించేవారు. కొంతకాలం ఉత్సవం నిలిచినా..1987లో ఆలయ అర్చకుడు కృష్ణమాచార్యుల సూచనల మేరకు పునఃప్రారంభించారు.
News November 19, 2025
ఆపరేషన్ కగార్.. వరంగల్ అన్నల రక్త చరిత్ర..!

కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ దాడుల్లో ఉమ్మడి WGL జిల్లాకు చెందిన పలువురు కీలక మావోయిస్టు నేతలు ఈ ఏడాదిలో హతమయ్యారు. సెప్టెంబర్ 11న ఛత్తీస్గఢ్ గరియాబాద్ అడవుల్లో మడికొండకు చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్ మృతి చెందగా, జూన్ 18న ఏవోబీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేశ్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. అలాగే రేణుక, సారయ్య, రాకేశ్ కూడా బీజాపూర్, అబూజ్మడ్ అడవుల్లో మృతి చెందారు.
News November 19, 2025
ముత్యాలమ్మపాలెం: చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు గల్లంతు

పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం సముద్ర తీరం నుంచి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు సూరాడ ముత్యాలు గల్లంతయ్యాడు. బుధవారం ఉదయం ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళుతుండగా అలల తాకిడికి పడవ బోల్తా పడింది. చింతకాయల పెంటయ్య, అర్జిల్లి బండియ్య గాయాలతోను మిగిలినవారు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. మత్స్యకార సంఘం రాష్ట్ర నాయకుడు చింతకాయల ముత్యాలు మెరైన్ పోలీసులు, అధికారులకు ఫిర్యాదు చేశారు.


