News January 31, 2025
MHBD: కూతురి పెళ్లి కోసం దాచుకున్న నగదు చోరీ

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోద్గులగూడెం శివారు బేగావతు తండాలో భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన వీరన్న ఇంట్లో కూతురి పెళ్లి కోసం దాచుకున్న రూ.9 లక్షల నగదు దోచుకుపోయారని బాధితులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న సీరోలు ఎస్సై సీహెచ్ నగేశ్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
Similar News
News November 6, 2025
HYD: 3 నెలలైనా ఎందుకు పట్టించుకోవడం లేదు: సీఎం

బీఆర్ఎస్ సహకరించకపోతే మోదీ ప్రధాని అయ్యేవారు కాదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ పేరుతో జూబ్లీహిల్స్లో ఓట్లు అడుగుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరితే KCRకు 24 గంటల్లో చిప్పకూడు తినిపిస్తానన్న MP కిషన్ రెడ్డి, విచారణకు ఆదేశించి 3 నెలలైనా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ 30 వేల మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
News November 6, 2025
సంగారెడ్డి: ఖోఖో సెలక్షన్ల తేదీలు మార్పు

సంగారెడ్డిలో జరగనున్న ఉమ్మడి మెదక్ జిల్లా ఎస్జీఎఫ్ ఖోఖో సెలక్షన్స్ టోర్నమెంట్ తేదీల్లో మార్పు చేసినట్లు జిల్లా ఖోఖో సంఘం సెక్రటరీ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. అండర్- 14, 17 విభాగాల బాలురకు ఈ నెల 11న, బాలికలకు 12న సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు బుధవారం ప్రకటించారు. క్రీడాకారులు ఈ విషయాన్ని గమనించి సకాలంలో హాజరు కావాలని కోరారు.
News November 6, 2025
అమ్మకానికి RCB.. మార్చి 31 నాటికి కొత్త ఓనర్!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)ను <<18032689>>అమ్మకానికి<<>> ఉంచినట్లు సమాచారం. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైందని, 2026 MAR 31 నాటికి కొత్త ఓనర్ చేతుల్లోకి ఫ్రాంచైజీ వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్కు ఇచ్చిన సమాచారంలో పేరెంట్ కంపెనీ Diageo (United Spirits Limited) ఈ విషయాన్ని పేర్కొన్నట్లు తెలిసింది. ఇదే జరిగితే వచ్చే IPL సీజన్లో కొత్త కంపెనీ ఆధ్వర్యంలో RCB ఆడే ఛాన్స్ ఉంది.


