News January 31, 2025
MHBD: కూతురి పెళ్లి కోసం దాచుకున్న నగదు చోరీ

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోద్గులగూడెం శివారు బేగావతు తండాలో భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన వీరన్న ఇంట్లో కూతురి పెళ్లి కోసం దాచుకున్న రూ.9 లక్షల నగదు దోచుకుపోయారని బాధితులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న సీరోలు ఎస్సై సీహెచ్ నగేశ్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
Similar News
News February 16, 2025
చికెన్ మార్కెట్.. ఆదివారం ఆదుకునేనా?

చాలా ఇళ్లలో ఆదివారం వచ్చిందంటే ముక్క లేనిదే ముద్ద దిగదు. అయితే బర్డ్ ఫ్లూ భయాందోళనలతో గత కొన్ని రోజులుగా చికెన్, గుడ్డు తినడాన్ని చాలామంది తగ్గించేశారు. ప్రమాదం లేదని ప్రభుత్వమే చెబుతున్నా ప్రజలు భయపడుతున్నారు. రేట్లు భారీగా పడిపోవడంతో పౌల్ట్రీ రైతులు లబోదిబోమంటున్నారు. మరి ఆదివారమైనా ప్రజలు తిరిగి చికెన్ వైపు చూస్తారా లేక ఇతర నాన్ వెజ్ ఆప్షన్లను ఎంచుకుంటారా? చూడాలి.
News February 16, 2025
నా పేరు మీద నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలు: నిర్మల్ కలెక్టర్

నిర్మల్ జిల్లా కలెక్టర్ పేరుతో ఉన్న నకిలీ ఫేస్బుక్ ఖాతాలను నమ్మవద్దని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పేరుతో కొందరు నకిలీ ఫేస్బుక్ ఖాతాలను సృష్టించారని ఆమె పేర్కొన్నారు. ఆయా ఫేస్బుక్ ఖాతాలకు ఎట్టి పరిస్థితుల్లో స్పందించవద్దన్నారు. జిల్లా కలెక్టర్ పేరుతో, ఫొటోలతో ఉన్న ఫేస్ బుక్ ఖాతాలు నకిలీవని, ఇప్పటికే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించామన్నారు.
News February 16, 2025
బాల్కొండ: చేపల వేటకు వెళ్లి జాలరి మృతి

బాల్కొండకు చెందిన జాలరి బట్టు నారాయణ(55) చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి శనివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నారాయణ రోజూలాగే ఉదయం 4 గంటలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వద్ద చేపల వేటకు నీటిలో దిగాడు. చేపల కోసం పెట్టిన కండ్రిగలో వలలో చిక్కుకుని నీట మునిగి చనిపోయాడు. స్థానికుల సమాచారంతో మృతదేహాన్ని బయటికి తీసి పోలీసులు పోస్ట్ మార్టమ్ నిమిత్తం ఆర్మూర్‌కు తరలించారు.