News March 14, 2025
MHBD: కొడుకుతో ఇంటి నుంచి వెళ్లిపోయిన మహిళ

మహబూబాబాద్ జిల్లా ఇస్లావత్ తండాకు చెందిన భూక్యా శ్రీలతకు ఆమె భర్త మోతిలాల్‌కు మార్చి 4వ తేదీన వాగ్వాదం జరిగింది. అదే రోజు రాత్రి ఇంటి నుంచి తన కొడుకు వినయ్‌ని తీసుకొని శ్రీలత బయటకు వెళ్ళిపోయింది. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు ఇళ్లు, ఇతర చోట్ల వెతికారు. కాని ఆచూకీ లేకపోవడంతో తల్లి ఇస్లావత్ కాంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కురవి SI సతీష్ తెలిపారు.
Similar News
News March 15, 2025
ఆయుర్దాయం పెరగాలంటే ఇలా చేయండి!

ఫ్యామిలీతో కలిసి ఎక్కువకాలం బతకాలని అందరూ కోరుకుంటారు. ఇది సాధ్యం కావాలంటే కొన్ని పనులు చేయాలని నిపుణులు చెబుతున్నారు. కడుపులో 80 శాతం నిండినంత వరకే తినాలి. టీవీ, ఫోన్ చూడకుండా నెమ్మదిగా కింద కూర్చునే తినాలి. హెర్బల్ టీ తాగాలి. రోజూ 7-8 గంటలు నిద్రపోవాలి. సమీపంలోని ప్రదేశాలకు నడక ద్వారానే వెళ్లాలి. క్రమం తప్పకుండా హెల్త్ చెకప్ చేయించుకుని వ్యాధులను గుర్తించి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.
News March 15, 2025
ఫీజిబిలిటీ రిపోర్ట్ రాగానే కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ పనులు

కేంద్ర ప్రభుత్వం తనిఖీ చేసిన తరువాత వెలువరించే ఫీజిబిలిటీ రిపోర్ట్ రాగానే కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ పనులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. శనివారం కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివ రావు అసెంబ్లీలో చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి స్పందించారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై సానుకూలంగా ఉన్నామని తెలిపారు.
News March 15, 2025
సన్మార్గంలో జీవించకపోతే కఠిన చర్యలు: SP

విజయనగరం జిల్లాలో రౌడీ షీట్ కలిగిన వ్యక్తులు నేర ప్రవృత్తిని విడనాడకుంటే కఠిన చర్యలు తప్పవని SP వకుల్ జిందాల్ హెచ్చరించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. రౌడీ షీట్ కలిగిన వ్యక్తుల ప్రవర్తన, కదలికలను నిత్యం గమనించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. బ్యాడ్ క్యారెక్టర్ షీట్లు కలిగిన వ్యక్తులను గుర్తించి బైండోవర్ చేయాలన్నారు. బీసీ షీట్లు కలిగిన వ్యక్తుల లేటెస్ట్ ఫోటోలు తీయాలన్నారు.