News July 31, 2024

MHBD: గంజాయి అక్రమ రవాణా.. 20 ఏళ్ల జైలు శిక్ష

image

MHBD జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. డోర్నకల్ పీఎస్ పరిధిలో 2021 అక్టోబర్ 10న బానోత్ కిరణ్, బాదావత్ సూర్య 300 కిలోల గంజాయిని ట్రాక్టర్ ట్రాలీ కింది భాగంలో పెట్టి తరలిస్తూ పోలీసులకు పట్టుబడటంతో కేసు నమోదైంది. దీంతో నిందితులను మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టగా జిల్లా కోర్టు జడ్జి చంద్రశేఖర ప్రసాద్ నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు, ఒక్కొక్కరికి రూ.2 లక్షల జరిమానా విధించారు.

Similar News

News November 2, 2025

గీసుకొండ: ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య

image

గీసుకొండ మండలం మొగిలిచర్లలో ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక అప్ప నాగరాజు (34) అనే ఆటో డ్రైవర్ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. కుటుంబ పరిస్థితులు దిగజారడంతో మనస్తాపానికి గురై ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

News November 2, 2025

సంగెం: గుంతలో పడి వృద్ధుడి మృతి

image

సంగెం మండలం లోహిత గ్రామంలోని నల్లాల గేట్‌వాల్ సమీపంలో ఉన్న గుంతలో పడి గుర్తు తెలియని వృద్ధుడు (సుమారు 60 ఏళ్లు) మృతి చెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి గుర్తింపు కోసం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

News November 2, 2025

వరంగల్: కబ్జాలతో కష్టాలు

image

వరంగల్ నగరాన్ని వరద ముంచెత్తింది. దీనికి ప్రధాన కారణం వర్షం కాదని, నాలాలు, కాలువలు, చెరువులపై జరుగుతున్న ఆక్రమణలేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు నగరానికి అందాన్ని తెచ్చిన 170కి పైగా చెరువులు, కుంటలు ఇప్పుడు అర్ధభాగం వరకు మాయం అయ్యాయని, మురికి కాలువలపై కొందరు అక్రమార్కులు భవనాలు, షాపులు నిర్మించుకుని ప్రజా భద్రతను సవాల్ చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.