News March 12, 2025
MHBD: గాంధీ సిద్ధాంతాల బ్రోచర్ ఆవిష్కరణ

మహబూబాబాద్ విద్యాశాఖ కార్యాలయంలో గాంధీ సిద్ధాంతాల కరపత్రాలు, బ్రోచర్లను జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. 1930 సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రం సబర్మతి ఆశ్రమం నుంచి మార్చి 12న మొదలై దండి వరకు 24 రోజుల పాటు జరిగిన ఉప్పు సత్యాగ్రహ మార్చ్ దేశ చరిత్రలో కీలక ఘట్టంగా పేర్కొంటారని తెలిపారు. నెల రోజులు జిల్లా వ్యాప్తం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.
Similar News
News March 24, 2025
BREAKING: మంత్రి వర్గ విస్తరణకు ఓకే!

TG: ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానంతో తెలంగాణ నేతల భేటీ ముగిసింది. మంత్రి వర్గ విస్తరణకు పార్టీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 4 మంత్రి పదవులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఉగాది రోజున ప్రకటన వెలువడే అవకాశముంది. దీంతో పాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులు భర్తీ చేసే ఛాన్స్ ఉంది.
News March 24, 2025
కంగ్రాట్స్ రాజీవ్.. మళ్లీ కత్తి దూసేందుకు సిద్ధం: శశి థరూర్

BJP కేరళ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన రాజీవ్ చంద్రశేఖర్‌కు కాంగ్రెస్ నేత, ఎంపీ శశి థరూర్ శుభాకాంక్షలు తెలియజేశారు. మరోసారి కత్తులు దూసేందుకు ఎదురు చూస్తున్నానని సరదాగా కామెంట్ చేశారు. వేర్వేరు పార్టీలైనప్పటికీ కొన్ని రోజులుగా వీరిద్దరూ కొన్ని అంశాలపై ఒకే రకమైన వాయిస్ వినిపిస్తున్నారు. 2024 LS ఎన్నికల్లో తిరువనంతపురంలో నువ్వానేనా అన్నట్టు జరిగిన పోటీలో రాజీవ్‌పై శశి 15వేల ఓట్ల మార్జిన్‌తో గెలుపొందారు.
News March 24, 2025
అమరావతి కాంట్రాక్ట్‌ల్లో అవినీతి: కాకాణి

అమరావతి కాంట్రాక్ట్‌ల్లో భారీ అవినీతి జరిగిందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం నెల్లూరులోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. 8 అనుకూల సంస్థలకే రూ.28,210 కోట్ల విలువైన పనులు అప్పగించారన్నారు. మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల నుంచి 8 శాతం కమీషన్లు పుచ్చుకున్నారన్నారు.